ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో రూ.5వేల కోసం భార్యకు విషాహారం పెట్టి చంపేశాడో భర్త. దీనికి కారణమైన అత్త, మరిది, భర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నందిగామ : ఆంధ్రప్రదేశ్లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఇంట్లో నగదు మాయమయ్యాయని, దానికి భార్య కారణమని అనుమానించిన భర్త, అత్తా, మరిది ఆమెకు విషాహారం పెట్టి చంపిన షాకింగ్ ఘటన నందిగామలో వెలుగు చూసింది. ఆమె తినే భోజనంలో విషం కలిపి తినిపించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె రెండు వారాలపాటు చికిత్స తీసుకుని మంగళవారం నాడు మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలను నందిగామ ఏసీబీ జనార్ధన నాయుడు ఇలా వివరించారు..
నందిగామ పెనుగంచిప్రోలు మండలానికి చెందిన జ్యోతి (28)కి 12 ఏళ్ల క్రితం కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన కన్నేటి హనుమంతరావుతో వివాహమయ్యింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వరుసగా పదేళ్లు, 8యేళ్ల వయసున్నఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక ఈనెల ఆరవ తేదీన ఇంట్లో ఉన్న 5000 రూపాయల నగదు మాయమైంది. భర్త హనుమంతరావు నగదు కనిపించడం లేదని.. నువ్వు చూసావా అంటూ భార్యను అడిగాడు. డబ్బుల విషయం తనకు తెలియదని భార్య చెప్పింది.
కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు అప్పుడేం చేశారు?.. వైఖరి మార్చుకోవాలి: సోము వీర్రాజు ఫైర్
అయితే అది నమ్మని హనుమంతరావు భార్య మీద తీవ్ర ఆగ్రహానికి వచ్చాడు. తల్లి చిట్టెమ్మ, తమ్ముడు కోటేశ్వరరావులతో కలిసి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అదే రోజు రాత్రి భార్య భోజనం చేసే సమయంలో ఆమెకు బెండకాయ కూర వడ్డించారు. అంతకుముందే అత్త, మరిది, భర్త వేరే కూరతో భోజనం చేశారు. ఆ తర్వాత ఆమెకు ఫ్రిజ్లో నుంచి కూల్ డ్రింక్ తీసి ఇచ్చారు.
అంతకుముందే ఆ కూల్ డ్రింక్ కూతురు తాగుబోగా ఆమెను వారించి జ్యోతికి ఇచ్చాడు. కూల్ డ్రింక్ తాగిన కాసేపటికి జ్యోతి కడుపులో మంటగా అనిపించడంతో దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెల్లింది. కాస్త తెరపి ఇచ్చినా.. ఇంకా తగ్గకపోవడంతో మరుసటి రోజు తన తల్లి దగ్గరికి వెళ్లి అక్కడే రెండు వారాలుగా వైద్యం చేయించుకుంటుంది. కడుపులో నొప్పి తగ్గకపోగా రోజు రోజుకి ఎక్కువ అవుతుండడంతో ఈనెల 10వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేరింది.
అయితే ఆమెకు విషాహారం పెట్టిన విషయం తెలిసిన నందిగామ ఏసీబీ జనార్ధన నాయుడు కంచికచర్ల పోలీసులు విజయవాడ ఆస్పత్రికి వెళ్లి ఆమెను ఈ విషయం మీద విచారించారు. వారికి తన భర్త, అత్త, మరిది భోజనంలో విషయం కలిపి తనకు పెట్టారని.. తనను కొట్టి హింసించారని.. ఆ ముగ్గురి మీద చర్యలు తీసుకోవాలని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందింది. జ్యోతి అంతకుముందు చెప్పిన మాటల ఆధారంగా భర్త హనుమంతరావు, అత్త చిట్టెమ్మ, మరిది కోటేశ్వర రావులపై హత్యానరం కింద కేసులు నమోదు చేశామని ఏసిపి తెలిపారు.
