బహిరంగసభ నిర్వహించిన ఎస్పీజీ గ్రౌండ్లో అసలు జనాలకు కూర్చోవటానికి స్ధలమే సరిపోలేదు. అంతేకాదు, గ్రౌండ్ చుట్టుపక్కలతో పాటు నంద్యాల పట్టణంలోని దాదాపు వీధిలోని వైసీపీ శ్రేణులు, స్ధానిక ప్రజలతో నిండిపోయింది. దాదాపు రెండు నెలలుగా అభివృద్ధి పనులంటూ అధికార టిడిపి ఊదరగొడుతున్నా ఈ స్ధాయిలో వైసీపీ బహిరంగసభకు జనాలు రావటం టిడిపికి నిజంగా షాకే.
నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో జనాలు పోటెత్తారు. గురువారం సాయంత్రం జరిగిన వైసీపీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఉపఎన్నికల ప్రచారాన్ని జగన్ బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా శ్రీకారం చుట్టారు. బహిరంగసభ నిర్వహించిన ఎస్పీజీ గ్రౌండ్లో అసలు జనాలకు కూర్చోవటానికి స్ధలమే సరిపోలేదు. అంతేకాదు, గ్రౌండ్ చుట్టుపక్కలతో పాటు నంద్యాల పట్టణంలోని దాదాపు వీధిలోని వైసీపీ శ్రేణులు, స్ధానిక ప్రజలతో నిండిపోయింది.
దాదాపు రెండు నెలలుగా అభివృద్ధి పనులంటూ అధికార టిడిపి ఊదరగొడుతున్నా ఈ స్ధాయిలో వైసీపీ బహిరంగసభకు జనాలు రావటం టిడిపికి నిజంగా షాకే. అభివృద్ధి పనుల పేరుతో చంద్రబాబునాయుడు రెండుసార్లు నంద్యాలకు వచ్చారు. లోకేష్ ఒకసారి వచ్చారు. ఇక మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. ఉపఎన్నిక సందకర్భంగా ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నా ప్రతిపక్షం నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో టిడిపి నేతలకు ఏం మాట్లాడలో అర్ధం కావటం లేదు.
వచ్చిన జనాల్లో కూడా ముస్లిం మహిళలు, మహిళలతో పాటు యువత పెద్ద ఎత్తునున్నారు. సభలో పాల్గొన్న జనాల్లో వక్తల ప్రసాంగాలు ముఖ్యంగా జగన్ ప్రసంగం బాగా ఆకట్టుకున్నట్లే ఉంది. ఎందుకంటే, జగన్ ప్రసంగంలో పలుమార్లు సానుకూలంగా స్పందించటం గమనార్హం.
