అఫైర్: మంచానికి కట్టేసి ప్రియుడ్ని తగులబెట్టిన ప్రేయసి

First Published 30, Jul 2018, 8:16 AM IST
Home gaurd killed by his fiancee
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మర్రిపూడి గ్రామంలో ప్రియుడు షబ్బీర్ ను అతని ప్రేయసి ఇమాం బీ సజీవ దహనం చేసింది. కోళ్ల ఫారంలో మంచానికి కట్టేసి, పెట్రోల్ పోసి అతని ఒంటికి నిప్పంటించింది.

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మర్రిపూడి గ్రామంలో ప్రియుడు షబ్బీర్ ను అతని ప్రేయసి ఇమాం బీ సజీవ దహనం చేసింది. కోళ్ల ఫారంలో మంచానికి కట్టేసి, పెట్రోల్ పోసి అతని ఒంటికి నిప్పంటించింది.

షబ్బీర్ పొదిలిలో హోం గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అతను ఇమాంబీ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఇద్దరు కలిసి పౌల్ట్రీ ఫారం నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. షబ్బీర్ ఇమాంబీను కొట్టడం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో పగ పెంచుకున్న ఆమె అతన్ని చంపడానికి ప్లాన్ వేసుకుంది.

లైంగిక క్రీడ సాగిస్తున్న క్రమంలో అతని చేతులను గొలుసులతో మంచానికి కట్టేసింది. ఆ తర్వాత అతన్ని కాల్చి చంపింది. కోళ్లఫారంలోంచి మంటలు వస్తుండడంతో స్థానికులు ప్రశ్నించారు. చెత్తను తగులబెట్టినట్లు ఆమె వారిని నమ్మించడానికి ప్రయత్నించింది. అయితే, వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

loader