అమరావతి: చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో వైఎస్ జగన్ ప్రభుత్వం తీరుపై, పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబిఐకి ఎందుకు అప్పగించకూడదని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐకి అప్పగించడానికి అన్ని అర్హతలున్న కేసుగా దీన్ని అభిప్రాయపడింది. 

విచారణ పట్ల కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని అంటూ కేసును కొట్టేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. తమ ప్రభుత్వంలో ఎవరినైనా సంతృప్తిపరచగలరని హైకోర్టు వ్యాఖ్యానించింది. కిరణ్ కుమార్ తో పాటు సహ నిందితుడి ఫోన్ కాల్ రికార్డును ఇస్తామని కిరణ్ కుమార్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ చెప్పగా ఆ అవసరం లేదని హైకోర్టు చెప్పింది. 

Also Read: చీరాలలో యువకుడి మృతి: ఎస్ఐ విజయ్‌కుమార్ పై సస్పెన్షన్ వేటు

పూర్తి వివరాలు అందించేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది రెండు వారాల గడువు అడిగారు. దాంతో తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కిరణ్ కుమార్ తరఫున మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మాస్కు పెట్టుకోలేదనే ఆరోపణతో ప్రకాశం జిల్లా చీరాల ఎస్సై విజయ్ కిరణ్ కుమార్ మీద దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కిరణ్ కుమార్ గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 22వ తేదీన మరణించాడు. ఈ ఘటనపై సీఐ విజయ్ ను ఎస్పీ సిద్దార్థ కౌశల్ సస్పెండ్ చేశారు. ఈ సంఘటన జులైలో జరిగింది. 

Also Read: ఎస్సై చేతిలో చీరాలలో యువకుడి మృతి, జగన్ సీరియస్, విచారణ