ఒంగోలు: మాస్కు పెట్టుకోలేదనే నెపంతో  కిరణ్ అనే యువకుడిపై దాడి చేసిన కేసులో ప్రకాశం జిల్లా చీరాల ఎస్ఐ విజయ్  ను ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ మంగళవారంనాడు సస్పెండ్ చేశారు.

మాస్కు పెట్టుకోలేదనే ఉద్దేశ్యంతోనే  ఈ నెల 18వ తేదీన కిరణ్ పై ఎస్ఐ విజయ్ కుమార్ దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్ కుమార్ గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్  ఈ నెల 22వ తేదీన మరణించాడు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. 

జీపులో తరలిస్తుండగా కిరణ్ కుమార్ దూకడంతో ఆయనకు గాయాలైనట్టుగా విజయ్ కుమార్ వివరణ ఇచ్చాడు. తాము అతనిపై దాడి చేయలేదని  ఎస్ఐ కుటుంబసభ్యులకు ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చారు. 

కిరణ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎస్సై విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.. ఘటనకు సంబంధించి కందుకూరు డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. కానీ కిరణ్ తండ్రి మాత్రం ఇదంతా పోలీసులు కావాలనే కేసును తారు మారు చేసి పోలీసులపైకి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.

ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విజయ్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ మంగళవారం నాడు ప్రకటించారు.