Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్... రాజధాని నిర్ణయంతో ఆర్థిక నష్టం, ఆ శాఖకు నోటీసులు

రాజధాని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారన జరిపిన న్యాయస్థానం ఆర్థిక, గణాంకాల శాఖకు నోటీసులు జారీ చేసింది. 

High court inquiry on AP Capital Issues
Author
Amaravathi, First Published Oct 8, 2020, 12:26 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో దాఖలయిన పిటిషన్లపై ఇవాళ(గురువారం) విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్థిక, గణాంకాల శాఖకు నోటీసులు జారీ చేసింది. వైసిపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పటివరకు ఏమయినా జరిగిన ఆర్థిక నష్టం జరిగిందా... జరిగితే ఎంత జరిగిందన్న వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. రాజధాని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ మేరకు హైకోర్టు ఈ నోటీసులిచ్చింది. 

రాజధానికి సంబంధించిన వ్యాజ్యంలో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌కు నోటీసులు జారీచేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇప్పటి వరకు చేసిన ఖర్చుపై... నివేదిక సమర్పించేలా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ని ఆదేశించాలని కోరుతూ రాజధాని రైతు ఇడుపులపాటి రాంబాబుతో పాటు మరికొందరు అనుబంధ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయా సంస్థలకు సమాచారాన్ని కోరుతూ నోటీసులు జారీ చేసింది. 

read more   రాజధాని వివాదాలపైనే 100కు పైగా పిటిషన్లు... హైకోర్టు కీలక నిర్ణయం

రాజధానితో ముడిపడి ఉన్న ప్రధాన వ్యాజ్యాల్లోని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే. మహేశ్వరి, జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంశాల వారీగా విచారణ కొనసాగించింది. మరికొన్ని వ్యాజ్యాలను సోమవారానికి వాయిదా వేసింది. సీఎం క్యాంప్ కార్యాలయం తరలింపు సహా పలు ఇతర అంశాలపై ఇవాళే (గురువారం)విచారణ జరపాల్సి ఉండగా... వాటినీ సోమవారమే విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఇప్పటికే రాజధాని బిల్లులపై జనవరిలో జరిగిన మండలి చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను సీడీలు, సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తాజాగా ఇప్పుడు ఆర్థిక వివరాలను కోరుతూ సంబంధిత శాఖకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. 

Follow Us:
Download App:
  • android
  • ios