గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం రేపూడి  వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  కారు, మినీ లారీ ఒకదానికి మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో  తొలుత నలుగురు ప్రాణాలు కోల్పోగా...  ఇప్పుడు మృతుల సంఖ్య ఆరుకి చేరింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read భార్యతో గొడవ, అత్త ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు...

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.... పరిమితికి మించిన వేగంతో  రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కాగా... ఈ ప్రాంతంలో గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.