గుంటూరు: హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును బుధవారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.వెంకటేశ్వరరావు అరెస్ట్ తో  అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 27కు చేరింది.

అగ్రిగోల్డ్ కు చెందిన 17 డొల్ల కంపెనీల్లో కూడ అల్లూరి వెంకటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్నారని  పోలీసులు చెబుతున్నారు. హాయ్‌ల్యాండ్‌ను అమ్మకుండా అగ్రిగోల్డ్ ఛైర్మెన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి  అల్లూరి వెంకటేశ్వరరావు కుట్ర పన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ మేరకు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించినట్టు సమాచారం.  హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును  గురువారం నాడు  కోర్టులో హాజరుపర్చనున్నారు. హాయ్ ల్యాండ్ కు అగ్రిగోల్డ్ కు సంబంధం లేదని ఇటీవలనే కోర్టులో కూడ అగ్రిగోల్డ్ యాజమాన్యం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


సంబంధిత వార్తలు

అగ్రిగోల్డ్ బాధితుల ‘‘ఛలో హాయ్‌ల్యాండ్‘‘‌ను అడ్డుకున్న పోలీసులు

అగ్రిగోల్డ్ కేసులో ట్విస్ట్: సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి