Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్ బాధితుల ‘‘ఛలో హాయ్‌ల్యాండ్‘‘‌ను అడ్డుకున్న పోలీసులు

అగ్రిగోల్డ్ బాధితుల ‘‘ఛలో హాయ్‌ల్యాండ్’’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్ ల్యాండ్ తమది కాదని తాజాగా కోర్టుకు తెలపడం.. ఆ వెంటనే నిరసనలు రావడంతో మళ్లీ మాట మార్చింది అగ్రిగోల్ యాజమాన్యం.

agrigold victims protest rally at haailand
Author
Vijayawada, First Published Nov 21, 2018, 9:36 AM IST

అగ్రిగోల్డ్ బాధితుల ‘‘ఛలో హాయ్‌ల్యాండ్’’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్ ల్యాండ్ తమది కాదని తాజాగా కోర్టుకు తెలపడం.. ఆ వెంటనే నిరసనలు రావడంతో మళ్లీ మాట మార్చింది అగ్రిగోల్ యాజమాన్యం.

ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు తమ ఆందోళననను మరింత ఉధృతం చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద ఉన్న హాయ్‌ల్యాండ్‌ను ముట్టడించేందుకు బాధితులు బయల్దేరారు.

రెండు బృందాలుగా విడిపోయిన బాధితులు.. బెజవాడ నుంచి కనకదుర్గ వారధి వైపు ఒక బృందంగా... మంగళగిరి శివార్ల నుంచి మరో బృందం హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంది.. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వీరిని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై అడ్డుకున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంది.. ఇప్పటికే పలువురు వామపక్షనేతలను అదుపులోకి తీసుకోవడంతో పాటు.. హాయ్‌ల్యాండ్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios