Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్ కేసులో ట్విస్ట్: సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి

 అగ్రిగోల్డ్ కేసు వ్యవహరం మలుపు తిరిగింది. హాయ్ లాండ్ తమది కాదని ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టులో స్పష్టం చేసింది.

High court dissatisfied on cid enquiry over agrigold case
Author
Hyderabad, First Published Nov 16, 2018, 3:40 PM IST

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు వ్యవహరం మలుపు తిరిగింది. హాయ్ లాండ్ తమది కాదని ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టులో స్పష్టం చేసింది. శుక్రవారం నాడు హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసుపై విచారణ జరిగిన సందర్భంగా హైకోర్టులో  అగ్రిగోల్డ్ ‌ యాజమాన్యం ట్విస్ట్ ఇచ్చింది.  

హాయ్‌లాండ్ తమది కాదని  తేల్చి చెప్పింది. అగ్రిగోల్డ్ కేసు విచారణ సందర్భంగా హాయ్‌లాండ్ ప్రాపర్టీ తమది కాదని ఆ సంస్థ ప్రతినిధి ఆలూరి వెంకటేశ్వరరావు హైకోర్టులో చెప్పారు.అయితే ఈ విషయమై అఫిడవిట్  దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ విషయమై సీఐడీ దర్యాప్తుపై  హైకోర్టు  అసంతృప్తిని వ్యక్తం చేసింది.

విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని  హైకోర్టు  అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది.ఇంత కాలం పాటు ఈ విషయాన్ని చెప్పనందుకుగాను  అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.  అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లాల వారీగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios