అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తనపై స్పందించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తనపై స్పందించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు.. ఆయన చర్యలు అపరిపక్వత, పిల్ల చేష్టల్లా ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. అవిశ్వాసం బీజేపీకి ఒక భారీ విజయమని.. ఇది ట్రైలర్ మాత్రమేనని ఆయన అన్నారు..
మోడీని ద్వేషించడంలోనే ప్రతిపక్షాలు ఐక్యతను ప్రదర్శిస్తున్నాయని.. అవిశ్వాసం పెట్టి చంద్రబాబు ఏం సాధించారని నరసింహారావు ప్రశ్నించారు. అవిశ్వాసంలో బాబు విఫలమవ్వడమే కాకుండా తెలుగుప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు సిగ్గుపడేలా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని.. ప్రత్యేకహోదా విషయంలో సీఎం యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
Last Updated 21, Jul 2018, 6:11 PM IST