మొత్తానికి విజయ్ రూపానీ గెలిచారు. ఉదయం నుండి తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న కౌంటింగ్ లో భారతీయ జనతా పార్టీ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి తొలినుండి వెనకబడే ఉన్నారు. అయితే, సగం రౌండ్లు పూర్తయిన తర్వాత కాస్త పుంజుకున్నారు. గుజరాత్ రాజ్ కోట్ వెస్ట్ లో పోటీ చేసిన రూపానీ చివరకు అతికష్టం మీద కాంగ్రెస్ అభ్యర్ధిపై 4700 ఓట్ల మెజారిటీతో గెలిచామనిపించుకున్నారు. నిజానికి మోడి హవా కొనసాగుతోందని భాజపా నేతలు చెప్పుకుంటున్న నేపధ్యంలో భాజపా అభ్యర్ధులు గెలుపుకు నానా అవస్ధలు పడుతున్నారు. కౌంటింగ్ సరళీ అదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. తాజాగా రూపాని గెలుపు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.