అధికార పార్టీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారనే ప్రచారం మొదలైంది.
ఇద్దరు నేతల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలాగ మారుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన అధికార-ప్రతిపక్ష పార్టీల నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎంఎల్ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది.
టిడిపిలో సీనియర్ నేత, ఎంఎల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ప్రతిపక్ష వైసీపీ ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనరెడ్డి అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కాకాణి దెబ్బకు సోమిరెడ్డి అత్యంత అవినీతిపరుడంటూ బాగా ప్రచారం జరిగింది. దాంతో సోమిరెడ్డి కాకాణిపై ఫిర్కాదు చేసారు. పోలీసులు కూడా అత్యుత్సాహంతో వెంటనే కేసు కూడా కట్టేసారు.
అయితే ఎప్పుడో ఎన్నికల సమయంలో జరిగిన కల్తీ మద్యం కేసుకు హటాత్తుగా సిఐడి దుమ్ము దులిపటం ఆశ్చర్యంగా ఉంది. నిజంగా వైసీపీ ఎంఎల్ఏలకు కల్తీ మద్యం కేసుతో సంబంధాలుంటే మరి ఇంత కాలం ప్రభుత్వం ఏమి చేస్తోందో అర్ధం కావటం లేదు.
ఇద్దరు వైసీపీ ఎంఎల్ఏలపై కల్తీ మద్యం కేసులు తదితరాలు నమోదు కావటంతో అధికార పార్టీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని చూస్తోందని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇదే విషయమై కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. పోలీసు కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని అధికార పార్టీ చూస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు.
ధైర్యం ఉంటే తాను చేసిన ఆరోపణలపై, చూపించిన ఆధారాలపై సోమిరెడ్డి విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేసారు. చూడబోతే వీరిద్దరి మధ్య వివాదం ముందు ముందు బాగా ముదిరేట్లే ఉంది.
