మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు రిషికేశ్వరరెడ్డి ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం కలకలం రేపుతోంది. జమ్మలమడుగు టౌన్ బ్యాంకులో మంత్రి బంధువు రూ. 2 కోట్ల గోల్ మాల్ కు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ.
మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు రిషికేశ్వరరెడ్డి ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం కలకలం రేపుతోంది. జమ్మలమడుగు టౌన్ బ్యాంకులో మంత్రి బంధువు రూ. 2 కోట్ల గోల్ మాల్ కు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. బ్యాంకుకు రెడ్డి కొంతకాలం ఛైర్మన్ గా పనిచేసారు లేండి. ఆ సమయంలో భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డారట. సరే, ఆరోపణలన్నాకు విచారణ తప్పదు కదా? ఆ విచారణలో మోసానికి పాల్పడింది వాస్తవమేనని తేలిందట. అందుకే మంత్రి బంధువు ఆస్తులను అటాచ్ చేస్తూ డివిజినల్ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే వియ్యంకుడు కేశవరెడ్డి రూ. 800 కోట్ల మోసం కేసులో జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఏంటో మంత్రి ఆదినారాయణరెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
