Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ అవినీతి మాటేమిటి?

పట్టుబడిన వారిపై ఎటువంటి చర్యలు లేకుండా లాబీయింగ్ చేసేది రాజకీయ నాయకులే అన్న విషయం అందరికీ తెలిసిందే.

Government pushing political corrption under carpet

అవినీతి ఏ రూపంలో ఉన్నా అంతం చేయాల్సిందే. ఎవరూ కాదనలేరు. ఉన్నతాధికారులైనా, ఉద్యోగులైనా సరే అవినీతికి పాల్పడిన వారిని శిక్షించ కూడదని ఎవరూ అనరు. అవితీకి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు, సంస్ధలను కూడా భారతీయ శిక్షా స్మృతి పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తోంది. మంచి ప్రయత్నమే. 

 

మరి సకల దరిద్రాలకూ మూలమైనే రాజకీయ అవినీతి గురించి నరేంద్రమోడి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే సిబిఐ చూసుకుంటుంది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని ఏసిబికి అప్పగిస్తారు. మరి ప్రజాప్రతినిధులు పాల్పడే అవినీతి విషయంలో నియమించిన ‘లోక్ పాల్’ కు మాత్రం కోరలు ఎందుకు పీకేసినట్లు? వ్యవస్ధల్లో దేనిపనిని దాన్ని చేసుకోనీయకపోవటం కూడా అవినీతి క్రిందకే వస్తుందని కేంద్రం గ్రహించాలి.

 

అవినీతి ఏ రూపంలో ఉన్న దానికి అండదండలు రాజకీయమే అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయ అవినీతిని నియంత్రిస్తే మిగిలిన అవినీతి ఏ రూపంలో ఉన్నా ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తుంది. ఏ ఉన్నతాధికారిని లేదా ఉద్యోగిని అధికారులు పట్టుకున్నా  వారి తరపున వెంటనే రంగంలోకి దిగేది చాలా సందర్భాల్లో రాజకీయ నేతలే. పట్టుబడిన వారిపై ఎటువంటి చర్యలు లేకుండా లాబీయింగ్ చేసేది రాజకీయ నాయకులే అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా కేసుల్లో రాజకీయ నేతల దన్ను చూసుకునే ఉన్నతాధికారులైనా, అధికారులైనా అవినీతికి పాల్పడుతున్నారు.

 

ఇక, ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నేతల మాటేమిటి? నేతల పాత్రతో ఎన్ని కుంభకోణాలు వెలుగు చూడటం లేదు?  అలా పట్టుబడిన వారిపై ఇప్పటివరకూ ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? కాంగ్రెస్ అయినా, భాజపా అయినా అవినీతి విషయంలో ఒక్కలాగే వ్యవహరిస్తున్నాయి. అలాగే, రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల పరిస్ధితీ దాదాపుగా ఒక్కటే. ప్రాంతీయ పార్టీల తరపున ముఖ్యమంత్రులుగా ఉన్న వారిలో, ప్రముఖ నేతల్లో అవినీతి మకిలి అంటని వారు ఎంతమందున్నారో ఎవరైనా చెప్పగలరా? అవినీతికి పాల్పడుతూ పట్టుబడిన అఖిల బారతీయ సర్వీసు అధికారుల్లో ఎందరికి శిక్షలు పడ్డాయో ఇప్పటి వరకూ చెప్పగలరా? 

  కాబట్టి రాజకీయ అవినీతిని అంతమొందించనిదే మిగిలిన అవినీతి గురించి మాట్లాడుకోవటమంటే ‘గొంగట్లో కూర్చుని అన్నం తినటం’ లాంటిదే.

 

Follow Us:
Download App:
  • android
  • ios