Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరిలో కలకలం... స్కూల్ నుండి నలుగురు చిన్నారులు మిస్సింగ్ (Video)

స్కూల్ కి వెళతామంటూ ఇంట్లోంచి బయటకు వచ్చిన నలుగురు విద్యార్థులు కనిపించకుండా అదృశ్యమైన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. 

four school students missing in mangalagiri
Author
Mangalagiri, First Published Dec 7, 2021, 1:38 PM IST

మంగళగిరి: గత సోమవారం పాఠశాలకు వెళుతున్నామని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చిన నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో చోటుచేసుకుంది. నిన్నటినుండి ఇప్పటివరకు విద్యార్థుల ఆఛూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారుల మిస్సింగ్ (childrens missing) మంగళగిరిలో కలకలం సృష్టించింది.  

కనబడకుండా పోయిన చిన్నారుల తల్లిదండ్రులు, స్కూల్ టీచర్స్, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి పట్టణం (mangalagiri town)లోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో నివాసముండే చిన్నారులు మానుకొండ సంతోష్, ఈడె వెంకటేష్ గౌడ్, కలవకొండ వెంకటేశ్, కలవకొండ ప్రభుదేవా మంచి స్నేహితులు. వీరిలో ముగ్గురు విద్యార్థులు స్థానికంగా టిప్పర్ల బజార్ లోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరు ఐదో తరగతి, ఒకరు నాలుగో తరగతి చదువుతున్నాడు.

Video

ఇక మరో విద్యార్థి వెంకటేశ్ గౌడ్ యర్రబాలెం (yarrabalem) లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. వీరి నివాసాలు ఒకే కాలనీలో వుండటంతో అందరూ కలిసే పాఠశాలకు వెళ్లేవారు. ఇలా సోమవారం కూడా స్కూల్ కు కలిసే వెళ్లారు. ఇలా స్కూలుకని వెళ్లిన విద్యార్థులు ఇప్పటివరకు ఇంటికి తిరిగిరాలేదు. 

read more  సేవ పేరుతో చిన్నారులపై పైశాచికత్వం.. రౌడీషీటర్ కు దేహశుద్ధి....

అయితే ఓ ఉపాధ్యాయుడి తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడ తల్లిదండ్రులు తిడతారు, కొడతారనే భయంతోనే విద్యార్థులు కనిపించకుండా వెళ్లిపోయివుంటారని తెలుస్తోంది. సోమవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు క్లాస్ రూంలో బ్యాగులు పెట్టి బయట తిరిగడానికి వెళ్ళారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వెళ్లే సమయంలో బ్యాగుల కోసం రాగా ఓ మాస్టారు వారిని గమనించి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళారని నిలదీసాడు. అందుకు విద్యార్థులు సమాధానం చెప్పకపోవడంతో మంగళవారం తల్లిదండ్రులను తీసుకురావాలని సదరు టీచర్ సూచించాడు.

అయితే తాము స్కూలుకు వెళ్లకుండా బయటతిరుగుతున్నట్లు తెలిస్తే ఎక్కడ తల్లిదండ్రులు కొడతారోనని భయపడి విద్యార్థులు ఎక్కడికో వెళ్ళిపోయారు. సాయంత్రం పొద్దుపోయినప్పటికీ తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూడా వీరు లేకపోవడంతో పాఠశాల సిబ్బందితో కలిసి ఊరంతా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. 

read more  Amma Vodi: అమ్మ ఒడి కావాలంటే తప్పనిసరిగా ఆ లేఖలపై సంతకాలు ఉండాల్సిందే..

రాత్రంతా వెతికినా పిల్లల ఆఛూకీ లేకపోవడంతో మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లలు కనబడటం లేదని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు (missing case) చేసుకుని అదృశ్యమైన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

విద్యార్థుల మిస్సింగ్ కు సంబంధించి మంగళగిరి ఎస్సై మాట్లాడుతూ... స్కై బ్లూ రంగు చొక్కా, బ్లూ కలర్  ప్యాంట్ గల స్కూల్ యూనిఫామ్ ధరించిన నలుగురు విద్యార్థులు కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. పోలీసులు కూడా వీరి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని ఎస్సై వివరించారు. స్కూల్ సమీపంలోని సిసి కెమెరాల ఆధారంగా విద్యార్థులు ఎటువైపు వెళ్లారో గుర్తించనున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios