భయపడి బీజేపీ పారిపోయింది, బ్లాక్‌డే: సుజనా చౌదరి

Former union minister sujana chowdary reacts on rajnath singh comments
Highlights

ఏపీకి ఇచ్చిన హమీల విషయమై బీజేపీ మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసిందని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు.  తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందన్నాను. ఇవాళ బ్లాక్‌ డే ఆయన అభివర్ణించారు.         


న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హమీల విషయమై బీజేపీ మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసిందని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు.  తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందన్నాను. ఇవాళ బ్లాక్‌ డే ఆయన అభివర్ణించారు.                 

రాజ్యసభ వాయిదా పడిన తర్వాత మంగళవారం సాయంత్రం  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సాక్షిగా బీజేపీ నేతలు  మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని  ఆయన ఆరోపించారు. 

4 ఏళ్లుగా  చెబుతున్న మాటలనే  ముగ్గురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు  చెప్పారన్నారు.  కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కొత్త సినిమా చూపేందుకు ప్రయత్నం చేశారని  ఆయన ఎద్దేవా చేశారు. సభ నియమనిబంధనలు తెలియకుండా జీవీఎల్ నరసింహారావు మాట్లాడారని సుజనా చౌదరి విమర్శించారు.సంఖ్యబలం ఉందని  బీజేపీ  నేతలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారన్నారు.

రాజ్యసభలో తాము వాకౌట్ చేసే అవకాశం కల్పించకుండానే సభను వాయిదా వేయడంపై సుజనాచౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి రాసిన లేఖకు సంబంధించి కట్ అండ్ పేస్ట్ చేశారన్నారు. 

ఆ లేఖలో  మధ్యలో రాసిన అంశాన్ని మాత్రమే  సభలో చదవి విన్పించారన్నారు.బీజేపీ అభిప్రాయాన్ని ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశారన్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు.

ఏపీకి ప్రత్యేకహోదాకు మద్దతుగా నిలిచిన  అన్ని పార్టీలకు  టీడీపీ ఎంపీ సీఎం రమేష్  ధన్యవాదాలు తెలిపారు.ఏపీ సమస్యలపై  స్పందించిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ నేతలు ఏపీ ప్రజల పట్ల ఏ రకంగా వ్యవహరించారనే దానిపై  ఇవాళ మరోసారి తేటతెల్లమైందన్నారు.బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. 168 నిబంధన కింద తాము నోటీసు ఇస్తే బీజేపీ భయపడి స్వల్పకాలిక చర్చను చేపట్టిందని చెప్పారు. ఏపీలో బీజేపీకి ఓట్లు, సీట్లు లేనందునే ఇలా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. బీజేపీకి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.

రాజ్యసభలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే  మంత్రులు తప్పించుకుపారిపోయారని టీడీపీ ఎంపీ  కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు  ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.


 

loader