Asianet News TeluguAsianet News Telugu

నాడు ద్రోహి.. నేడు దోస్తా?: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై పురంధరేశ్వరీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ద్రోహిలా కన్పించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం  ద్రోహి కాకుండా మంచిది ఎలా అయిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధరేశ్వరీ ప్రశ్నించారు.
 

Former union minister purandeswari slams on tdp
Author
Guntur, First Published Aug 22, 2018, 4:32 PM IST

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ద్రోహిలా కన్పించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం  ద్రోహి కాకుండా మంచిది ఎలా అయిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధరేశ్వరీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకొంటుందనే ప్రచారం సాగుతున్న తరుణంలో  బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేసింది.

అలాంటి  పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకొంటుందో చెప్పాలని  ఆమె డిమాండ్ చేశారు.  ఎన్టీఆర్ కుమార్తె‌గా తాను  కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. 

అయితే కాంగ్రెస్ పార్టీతో  టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలని  ఆమె వ్యాఖ్యానించారు.  ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని  వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని  ఆమె డిమాండ్ చేశారు.

ఈ వార్త చదవండి

రాజకీయాల్లోకి ఎన్టీఆర్ మరో మనుమడు : పర్చూరు నుండి పోటీ

 

Follow Us:
Download App:
  • android
  • ios