రాజకీయాల్లోకి ఎన్టీఆర్ మరో మనుమడు : పర్చూరు నుండి పోటీ

Daggubati purandeshwari's son Hitesh ready to enter into politics
Highlights

ఎన్టీఆర్ మరో మనుమడు హితేష్ చెంచురాము చ రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండి హితేష్ బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.


అమరావతి: ఎన్టీఆర్ మరో మనుమడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ తనయుడు హితేష్ చెంచురాము  2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.  అయితే ఏ పార్టీ నుండి  అతను బరిలోకి దిగుతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

దగ్గుబాటి  పురంధేశ్వరీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.  దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు మాత్రం ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే  వచ్చే ఎన్నికల్లో తమ వారసుడిగా హితేష్ చెంచురామును  బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.  అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ తనయుడు చెంచురాము 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి చెంచురామ్ బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు దగ్గుబాటి అనుచరులు.  2014 ఎన్నికలకు ముందే  క్రియాశీలక రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు  దూరంగా ఉన్నారు.  ఆయన సతీమణి పురంధేశ్వరీ మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు.

అయితే పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పలు దఫాలు  ఎమ్మెల్యేగా విజయం సాధించిన దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు  తన వారసుడిని కూడ అదే నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారని సమాచారం.  గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి సాంబశివరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 

సాంబశివరావు గెలుపులో దగ్గుబాటి అనుచరులు కీలకంగా వ్యవహరించారని చెబుతారు.  అయితే  పర్చూరు నియోజకవర్గం నుండి  దగ్గుబాటి హితేష్ చెంచురాము బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. అయితే  హితేష్ బీజేపీ నుండి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

వచ్చే ఎన్నికల్లో కూడ మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ  ఎంపీగానే పోటీ చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు  దగ్గుబాటి హితేష్ చెంచురాము  రాజకీయాల్లోకి వచ్చే విషయమై కొన్ని వారాల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. 


 

loader