ఇవాళ విచారణకు రాలేను: సీబీఐకి వైసీపీ నేత ఆమంచి సమాచారం


ముందుగా నిర్ణయించుకొన్న కార్యక్రమాలున్నందున ఇవాళ విచారణకు రాలేనని ఆమంచి కృష్ణమోహన్ సీబీఐ అధికారులకు సమాచారం పంపారు. వారం రోజుల్లో సమయం ఇస్తే తాను విచారణకు హాజరుకానున్నట్టుగా ప్రకటించారు. ఆమంచి కృష్ణమోహన్ వినతికి సీబీఐ అంగీకరించింది. 

Former MLA Amanchi Krishna Mohan urges  CBI To Give time to Attend  probe

అమరావతి: ముందుగా నిర్ణయించుకొన్న కార్యక్రమాల నేపథ్యంలో ఇవాళ విచారణకు రాలేనని CBI  అధికారులకు మాజీ ఎమ్మెల్యే, YCP  నేత ఆమంచి కృస్ణమోహన్ సీబీఐకి సమాచారం ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల విషయమై ఇవాళ విచారణకు రావాలని Amanchi Krishna Mohanకు సీబీఐ Notice జారీ చేసింది. ఈ నోటీసుల విషయమై ఆమంచి కృష్ణమోహన్ స్పందించారు.  ముందుగా నిర్ణయించుకొన్న కార్యక్రమాలు ఉన్నందున ఇవాళ విచారణకు రాలేనని ఆమంచి కృష్ణ మోహన్ సీబీఐ అధికారులకు సమాచారం పంపారు.  సమయం ఇస్తే వారం రోజుల్లో విచారణకు హాజురౌతానని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.  ఆమంచి కృష్ణమోహన్ ను చేసిన వినతి.పై సీబీఐ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.

సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ను CRPC 41 A  కింద ఆమంచి కృష్ణమోహన్ కు  సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు ప్రకారంగా ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు విజయవాడలోని సీబీఐ క్యాంప్ కార్యాలయానికి రావాలని పేర్కొంది. గతంలో కూడా విశాఖపట్టణంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు. 

వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే కొందరు Judge లు పనిగా పెట్టుకున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు..  న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదయ్యాయి.

also read:న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసు... వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆమంచికి సిబిఐ నోటీసులు

 ఈ వ్యవహారంలో తొలుత AP CID విచారణ నిర్వహించింది. సీఐడీ విచారణపై AP High Court హైకోర్టు పెదవి విరిచింది. ఈ కేసు విచారణణు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో గత ఏడాది నవంబర్  మాసంలో 16 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను యథాతథంగా నమోదు చేసినట్టుగా సీబీఐ తెలిపింది. ఐటీ సెక్షన్లలోని 154, 504, 505 సెక్షన్ల ప్రకారంగా సీఐడీ నమోదు చేసిన 12 FIR  ను ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్టుగా సీబీఐ ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios