Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక హోదా అంటే ఏమిటి: లాభాలెన్ని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ  తిరిగి ప్రచార అస్త్రంగా మార్చుతుంది.

 What is special status ?lns
Author
First Published Feb 2, 2024, 3:04 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు  వై.ఎస్. షర్మిల  న్యూఢిల్లీలో దీక్షతో  మరోసారి  ఈ అంశంపై చర్చ సాగుతుంది. 

2014లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం  2014  తెచ్చింది అప్పటి యూపీఏ ప్రభుత్వం.  ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. అయితే   2014లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదాతో సమానమైన  ప్యాకేజీని అప్పటి ప్రభుత్వం తీసుకుంది.ఈ విషయమై  అప్పట్లో  విపక్షాలు చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేశాయి. ప్రత్యేక హోదా కోసం  ఆందోళనలు నిర్వహించాయి. 

also read:ప్రత్యేక హోదాపై ఆందోళన: కాంగ్రెస్ వ్యూహమిదీ...

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను  వై.ఎస్. షర్మిల చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా అంశంపై ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇస్తుంది ఆ పార్టీ.ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు  అనేక ప్రయోజనాలుంటాయి.  పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజారిటీతో చట్టం చేస్తే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కుతుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో  పరిశ్రమలు పెట్టేవారికి  రాయితీలు దక్కుతాయి. అంతేకాదు ప్రోత్సాహకాలు కూడ వస్తాయి. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు  ఇచ్చే నిధుల్లో  30 శాతం తొలుత ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే ఇస్తారు.  మరో వైపు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం  నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను  రుణంగా ఇస్తారు.  దేశలోని అసోం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్,  లకు  ప్రత్యేక హోదాను తొలుత అమలు చేశారు. ఉత్తరాఖండ్,  మిజోరం, మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలకు  ప్రత్యేక హోదా దక్కింది. 1969లో ప్రత్యేక హోదా అంశం తెరమీదికి వచ్చింది. అప్పటి 5వ ఆర్ధికసంఘం  ప్రత్యేక హోదా సిఫారసులు చేసింది.  ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదాను కేంద్రం కొనసాగించే వెలుసుబాటు కూడ లేకపోలేదు.

రాష్ట్ర విభజన సమయంలో  ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. అయితే  రాష్ట్ర విభజన జరిగి  పదేళ్లు అయింది.  అయితే  ఈ విషయం రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారింది.  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీతో పాటు, పార్లమెంట్ కు  కూడ ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని  తెరమీదికి తెచ్చింది. 

also read:రంగారెడ్డి జిల్లా రైతు అదృష్టం:లక్కీ డ్రాలో కిలో బంగారం

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది.  కేంద్రంలో  ఉన్న ప్రభుత్వం  తమ ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి ఉంటే ప్రత్యేక హోదా అంశం తేలిపోయేదని  ఏపీ ముఖ్యమంత్రి జగన్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయినా కూడ  ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసిన సమయంలో ప్రత్యేక హోదా విషయాన్ని  అడుగుతూనే ఉన్నామని జగన్ పలుమార్లు ప్రకటించారు.

also read:రైల్వే జోన్ కోసం 52.22 ఎకరాలు సిద్దంగా ఉంది: విశాఖ కలెక్టర్ మల్లికార్జున

ఇదిలా ఉంటే  ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని  కేంద్రప్రభుత్వం ప్రకటించినట్టుగా కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.  తమకు అధికారం అప్పగిస్తే  ప్రత్యేక హోదాను ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios