రాజమండ్రి: దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఎన్ని పార్టీలు మారుతారో ఆయనకే తెలియదని  మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.ఆదివారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడేమో వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరుతున్నారని  ఆయన చెప్పారు.  

పురంధేశ్వరీ ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. వెంకటేశ్వరరావు ఎన్ని పార్టీలు మారారో ఆయనకే తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రోజుల్లో  పురంధేశ్వరీ కేంద్ర మంత్రిగా కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

బీజేపీ, వైసీపీలు కూడ ఒక్కటేనని ఆయన  ఆరోపించారు. వైసీపీ, టీఆర్ఎస్‌, బీజేపీలు టీడీపీని దెబ్బతీసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వాటిని బట్టబయలు చేసేందుకు టీడీపీ సిద్దంగా ఉందన్నారు..

సంబంధిత వార్తలు

వైసీపీలోకి హితేష్, బీజేపీలోనే పురంధేశ్వరీ: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

జగన్‌తో భేటీ: వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్

ఆ క్లియరెన్స్ వస్తే వైసీపీలోకి హితేష్: పురంధేశ్వరీ బీజేపీలోనే?

హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే