విజయవాడ దుర్గగుడి సింహాల ప్రతిమల మాయం: ఇంజనీరింగ్ శాఖ అధికారుల తప్పిదమేనా
విజయవాడ దుర్గమ్మ రథంపై ఉన్న సింహాల ప్రతిమలు మాయం ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న వారి తప్పిదమని అధికారులు భావిస్తున్నారు.
ఈ సింహాల ప్రతిమలు ఎక్కడికి వెళ్లాయనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.
విజయవాడ: విజయవాడ దుర్గమ్మ రథంపై ఉన్న సింహాల ప్రతిమలు మాయం ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న వారి తప్పిదమని అధికారులు భావిస్తున్నారు.
ఈ సింహాల ప్రతిమలు ఎక్కడికి వెళ్లాయనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అధికారి మూర్తిని విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం బుదవారం నాడు నియమించింది.
దుర్గగుడి ఆలయంలో వస్తువుల విషయంలో ఈ ఏడాది మే 18వ తేదీన 3320 సర్క్యులర్ ను ఈవో సురేష్ బాబు జారీ చేశారు. కొండపైనా కొండ దిగువన అమ్మవారి ఆలయానికి సంబంధించి విలువైన వస్తువులు ఎవరి కస్టడీలో లేవని ఈవో సురేష్ బాబు సర్క్యులర్ జారీ చేశారు.
also read:దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమల అదృశ్యంపై వాస్తవాలు చెప్పాలి: సోము వీర్రాజు
ఆలయ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వస్తువులు వాడుతున్నారని సర్క్యులర్ లో ఈవో పేర్కొన్నారు. ఆలయానికి సంబంధించిన వస్తువులను ఎవరైనా వాడితే వాటిని రిజిస్టర్ లో నమోదు చేసి రశీదు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.
రథంలో ప్రతిమలు మాయం ఇంజనీరింగ్ శాఖ తప్పిదంగా అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. సింహాల ప్రతిమలు మాయం కావడం ఏపీలో రాజకీయంగా రచ్చకు కారణమైంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఆ పార్టీ నేతలు ఇవాళ పరిశీలించారు.