సారాంశం

రుషికొండపై భవనాల, ఇతర నిర్మాణాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 23, 24వ తేదీల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి రానున్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి పారిపాలన సాగుతుందని చర్చ సాగుతోంది.

విశాఖపట్నంలోని రుషికొండపై వేగంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పర్యాటకశాఖ రిసార్టులో పేరుతో ఈ భవనాలకు రూ.200 కోట్లు నిధులను ఖర్చు చేశారు. అయితే ఆ భవనాలను సీఎం కార్యాలయాల కోసమే అని చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం వాటిని పర్యాటక శాఖ కోసమే నిర్మిస్తున్నారని, నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రభుత్వం ఆ భవనాలను ఏ రకంగానైన వినియోగించుకోవచ్చని వైసీపీ నాయకులు పలు సందర్భాల్లో మీడియాతో గతంలోనే చెప్పారు.

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

కాగా.. అక్టోబర్ 23, 24వ తేదీల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నానికి వస్తున్నారని, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడి నుంచే సాగుతుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాట్లు కొలిక్కి రావడాన్ని బట్టి సీఎంవో ఆఫీసుకు పూజ ముహూర్తం ఫిక్స్ చేస్తారని చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. రుషికొండలో పర్యావరణల అనుమతుల నేపథ్యంలో పర్మినెంట్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు వీలు కాకపోవడంతో.. కంటైనర్ మోడల్ లో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆఫీసర్లు చెప్పారని ‘ఈనాడు’ కథనం పేర్కొంది.

సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ?

దీని ఏర్పాటు అనంతరం భూగర్భ కేబుల్ తో అనుసంధానం చేస్తామని ఆఫీసర్లు పేర్కొన్నారు. రూ.7 కోట్ల వ్యయంతో కంటైనర్ సబ్ స్టేషన్ కోసం రెండు నెలల కిందట పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ పనులు చివరి దశకు వచ్చేశాయి. ఇదిలా ఉండగా.. రుషికొండపై ఇప్పటికే రెండు బిల్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఇంటరీయర్, ఫర్నీచర్ పనులు కొనసాగుతున్నాయి. మెయిన్ రోడ్డు నుంచి రుషికొండ వరకు రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి.

జాక్ పాట్ అంటే ఇదే.. రూ.100తో లాటరీ టికెట్ కొని.. రూ.కోటిన్నర గెలుచుకున్న స్నేహితులు.. (వీడియో)

అలాగే రుషికొండ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు, గ్రీనరీ పెంపొందించేందుకు పర్యాటక శాఖ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. రుషికొండ దగ్గరలో ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొంత కాలం కిందట సీఎంవో ఆఫీసు సెక్యూరిటీ టీం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. కాగా.. గతంలోనే జీ-20 సన్నాహక సదస్సు పేరుతో రుషికొండ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఇప్పుడు మిగిలిన పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు.