చిత్తూరు జిల్లాలో కలుషిత ఆహారం 80 మంది ప్రాణాల మీదకు వచ్చింది. పులిచర్ల మండలం పాతపేట గ్రామపంచాయతీ పరిధిలోని పూరేడువారి పల్లెలో రెండు రోజుల నుంచి శ్రీసీతారామస్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొంటున్నారు.. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఆలయ ఆవరణలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు.

ఈ విందులో అల్పాహారాన్ని తీసుకున్న పలువురు అస్వస్థతకు గురయ్యారు.. జ్వరం, విరేచనాలు, వాంతులతో విలవిలలాడిపోయారు.. దీంతో 108 వాహనాల్లో పీలేరు, కల్లూరు, దామలచెరువు, సుండుపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్లే జనం వీరంతా అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు.