Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయిందా? ఇంతకీ అధికారుల వివరణ ఏంటీ?

Floating Bridge: విశాఖ సాగర తీరంలోని ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ (Floating Bridge) తొలిరోజే సందర్శకులకు నిరాశను మిగిల్చింది. సోషల్‌ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలను అధికారులు ఖండించారు. విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోలేదని కలెక్టర్, విఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున స్పష్టం చేశారు. 

Floating Bridge at RK Beach comes apart one day after inauguration Krj
Author
First Published Feb 26, 2024, 11:09 PM IST

Floating Bridge: విశాఖ సాగర తీరంలోని ఆర్కే బీచ్‌లో వీఎంఆర్‌డీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ (Floating Bridge) తొలిరోజే సందర్శకులకు నిరాశను మిగిల్చింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్ధేశంతో దాదాపు కోటి 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తొలిరోజే పర్యాటకులకు అసంతృప్తి మిగిలింది. సోమవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. కానీ, పర్యటకులను అనుమతించకపోవడంతో వారు నిరాకరించడంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

సముద్రతీరం నుంచి వంద మీటర్లు లోపల ఉన్న ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ చివరి ఫ్లాట్‌ ఫామ్‌ ప్రారంభించిన మరుసటి రోజే తెగిపోయిందని ప్రచారం జరిగింది. ఈ చివరి ఫ్లాట్‌పామ్‌ను తెచ్చి అతికించేందుకు టెక్నికల్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారనీ,  ఒకవేళ సందర్శకులు ఉంటే పెను ప్రమాదం సంభవించేదని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.  

ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోలేదు! 

ఈ తరుణంలో సోషల్‌ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలను అధికారులు ఖండించారు. విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోలేదని కలెక్టర్, విఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున స్పష్టం చేశారు. నిర్వాహకులు T పాయింట్ వద్ద బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్ఠతను పరిశీలించారు. అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా సాంకేతిక పరిశీలన రెగ్యులర్ గా చేయాలనీ, ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోలేదని, తామే తొలగించమని వెల్లడించారు. టి పోయింట్ వద్ద సిబ్బంది బ్రిడ్జిని విడదీసిన వీడియోను ఆయన విడుదల చేశారు.  ట్రయల్‌ రన్‌లోనే ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఉందని, మాక్‌ డ్రిల్‌ చేస్తున్నామని తెలిపారు.  అందువల్ల బ్రిడ్జిపైకి సోమవారం నుంచే సందర్శకులను అనుమతించాలనుకున్నా కుదరలేదని తెలిపారు. సోషల్ మీడియాల్లో అనవసరంగా లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. 

ఈ బ్రిడ్జ్ భద్రతపై ఆందోళన అవసరం లేదని, సందర్శకులకు ఎలాంటి హామీ జరగకుండా తాము చర్యలు తీసుకుంటామన్నారు. ఆ బ్రిడ్జ్ పైకి వెళ్లే సందర్శకులకు పూర్తి భద్రత ఉంటుందనీ, వారికి లైఫ్‌ జాకెట్‌ ఇవ్వడంతోపాటు ఆ బ్రిడ్జ్ కు ఇరువైపులా ఎల్లప్పుడు రెండు పడవలు రక్షణ సిబ్బంది, గజ ఈతగాళ్లు ఉంటారని తెలిపారు. ప్రజలకు మీడియా కు అర్ధమయ్యేల వీడియో విడుదల చేస్తూ దానిలో చుప్పిస్తూ వివరించారు.  ఇదిలాఉంటే..  ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ అందుబాటులోకి వచ్చిందన్న ఉద్ధేశంతో సోమవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. ప్రవేశాన్ని నిరాకరించడంతో నిరుత్సాహంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios