ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నంలో అధికార వైసీపీలో ఫ్లెక్సీ వార్ హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణాప్రసాద్ వర్గాల మధ్య మరోసారి  ఫ్లెక్సీవార్ తెరపైకి వచ్చింది.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నంలో అధికార వైసీపీలో ఫ్లెక్సీ వార్ హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణాప్రసాద్ వర్గాల మధ్య మరోసారి ఫ్లెక్సీవార్ తెరపైకి వచ్చింది. మంత్రి జోగి రమేష్ అనుచరుడి పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఫొటోలతో ఇబ్రహీపట్నంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి సమయంలో వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అయితే ఫ్లెక్సీలను వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణాప్రసాద్ అనుచరులే చించేశారని మంత్రి జోగి రమేష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

Also Read: కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు అప్పుడేం చేశారు?.. వైఖరి మార్చుకోవాలి: సోము వీర్రాజు ఫైర్

వసంత కృష్ణప్రసాద్ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకే అతడి అనుచరులు ఫ్లెక్సీలు చించేశారని జోగి రమేష్ వర్గం ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీవార్ అధికార వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. వసంత కృష్ణాప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఫ్లెక్సీ వార్ చోటుచేసుకున్న ఇబ్రహీంపట్నం.. మైలవరం నియోజవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ క్రమంలోనే ఫ్లెక్సీల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగినట్టుగా వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతుంది.