Asianet News Telugu

ఫ్లాష్ బ్యాక్ 2018: చింతమనేనికి 'అపూ ర్వ' గండాలే..

చింతమనేని ప్రభాకర్ ఈ పేరు ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో తెలియనివారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చింతమనేని నిలుస్తారనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే 2018వ  సంవత్సరంలో అన్ని పార్టీలు చింతమనేని ప్రభాకర్ ను హిట్ లిస్ట్ లో పెట్టేశాయి. 

Flash back 2018: Chintamaneni in trouble
Author
Denduluru, First Published Dec 31, 2018, 2:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దెందులూరు: చింతమనేని ప్రభాకర్ ఈ పేరు ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో తెలియనివారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చింతమనేని నిలుస్తారనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే 2018వ  సంవత్సరంలో అన్ని పార్టీలు చింతమనేని ప్రభాకర్ ను హిట్ లిస్ట్ లో పెట్టేశాయి. 

2018 సంత్సరంలో అన్ని రాజకీయ పార్టీల నేతలనోట్లో ఈయనే ఉన్నారు. దీంతో ఈ ఏడాది వివాదాస్పద రాజకీయాలకు కేంద్రబిందువుగా చింతమనేని మారారు. వాస్తవానికి చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చుట్టూ వివాదాలే ఉంటాయి. చింతమనేని వ్యవహారశైలిపై ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు జనసేన పార్టీ, లెఫ్ట్ పార్టీలు నిప్పులు చెరిగాయి. 

ఎమ్మెల్యే అయి ఉండి అధికారులు, పోలీసుల మీద రౌడీయిజం చేస్తారని మండిపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాన్ కూడా చింతమనేని ప్రభాకర్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

ఏపీ ప్రతిపక్ష నేవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఓ ఆట ఆడుకున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశాడంటూ పదేపదే ఆరోపణలు చేశారు.  

చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం చేస్తున్నాడని ఆఖరికి పోలీసులను కూడా బెదిరిస్తున్నాడంటూ వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. చింతమనేని లాంటి నాయకుడు ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఉండరంటూ ఘాటుగా విమర్శించారు. 

ఇక జగన్ అయిపోయిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా దెందులూరు చేరుకున్నారు. దెందులూరు చేరుకున్న తర్వాత ఆయన చింతమనేని టార్గెట్ గా రెచ్చిపోయారు. చింతమనేని ఓ వీధిరౌడీ, ఆకు రౌడీ అంటూ విరుచుకుపడ్డారు. 

ఇలాంటి రౌడీలను తాను ఎప్పుడో తన్ని తరిమేశానని చెప్పుకొచ్చారు. చింతమనేని లాంటి రౌడీలు రాజకీయాలు చెయ్యడం ప్రజల దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. దళితులను  కులం పేరుతో దూషిస్తాడు, మహిళా ప్రభుత్వ ఉద్యోగులను తిడతాడు జుట్టుపట్టుకుని కొడతాడు, పోలీసులను బెదిరిస్తాడు, వార్తలు రాస్తే మీడియాను భయపెడతాడు.

ఇలాంటి రౌడీయిజానికి పాల్పడే చింతమనేనిని ఏనాడైనా చంద్రబాబు, లోకేష్ లు కనీసం మందలించారా అంటూ ప్రశ్నించారు. చింతమనేనికి ఎదురుతిరిగే దమ్ము ధైర్యం చంద్రబాబుకు కానీ లోకేష్ కు గానీ లేదన్నారు.

ఆ తర్వాత మధ్యలో సినీనటి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆమె సైతం తనదైన శైలిలో చింతమనేని ప్రభాకర్ ను ఓ ఆట ఆడుకుంది. చింతమనేనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. చింతమనేని లాంటి రౌడీని ఇంటికి పంపించాలంటూ పిలుపునిచ్చారు. 

అన్ని పార్టీలు విమర్శిస్తే తామేమైనా తక్కువ తిన్నామా అనుకున్నారో ఏమో లెఫ్ట్ పార్టీలు సైతం చింతమనేనిపై విరుచుకుపడ్డాయి. చింతమనేని వైఖరిపై చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 

మెుత్తానికి అందరినోట చింతమనేని  ప్రభాకర్ పేరే వస్తుండటంతో ఒకానొక సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చింతమనేనికి వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంగా ఉండాలని ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటానంటే సహించేది లేదంటూ మండిపడ్డారు. 

ఇలా 2018 సంవత్సరంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విపక్షాలకు ఓ అస్త్రంలా తయారయ్యారు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకున్నారో ఏమో విరుచుకుపడ్డారు. చింతమనేనిని టార్గెట్ చేస్తూ అన్ని పార్టీలు విరుచుకుపడటం పెద్ద చర్చకు లేవనెత్తింది. 

అయితే ఇటీవలే గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద నంబర్ ప్లేట్ లేని కారులో ఎమ్మెల్యే చింతమనేని తన కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు. ఈ విషయం గమనించిన టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యే అని చెప్పినా వినిపించుకోలేదు. 

కారును వెళ్లనియ్యకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక ఆర్టీసీ బస్సులో వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది చింతమనేనికి. ఇది పెద్ద పరాభవంగా చెప్పుకోవచ్చు. అయితే కారు ఆపిన టోల్ గేట్ సిబ్బందిపై తన వ్యక్తిగత సిబ్బందితో కేసులు పెట్టించారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.    

ఇదిలా ఉంటే సినీనటులు సైతం చింతమనేని ప్రభాకర్ ను వదల్లేదు. సినీనటి అపూర్వచౌదరి చింతమనేని ప్రభాకర్ పై పలు ఆరోపణలు చేశారు. అపూర్వ స్వగ్రామం దెందులూరు. దెందులూరులో ఆమెకు నాలుగు ఎకరాల భూమి ఉంది. 

అయితే ఆ భూమి సరిహద్దులకు సంబంధించి గత కొంతకాలంగా పక్క పొలాల రైతులకు, ఆమె కుటుంబ సభ్యులకు వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు కొలతలు వేసినా సరిహద్దులు గుర్తించినా కొందరు తమ పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది.

ఇటీవలే తన భూమికి సంబంధించి సర్వే చేయించి సరిహద్దులు రాళ్లు వేయించారు అపూర్వ. అయితే వాటిని సైతం పక్క పోలాల రైతులు తొలగించారు. సరిహద్దు రాళ్లు తొలగించడమే కాకుండా దుర్భాషలాడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు తన భూమిని కబ్జా చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వారి వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటూ పరోక్షంగా చింతమనేని ప్రభాకర్ పై పలు ఆరోపణలు చేసింది. చింతమనేనికి భయపడి కూడా పోలీసులు ఏమీ చెయ్యలేకపోతున్నారంటూ ఆమె వాపోయారు.

ఆ తర్వాత చింతమనేని అనుచరులు టార్గెట్ అపూర్వ అన్న విధంగా చెలరేగిపోయారు. సోషల్ మీడియా వేదికగా తనను వేధిస్తున్నారని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. 

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అపూర్వ.  

సోషల్ మీడియాలో చింతమనేని అనుచరులు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిజం ఉన్నా తనను నడిరోడ్డుపై ఉరితీయండన్నారు. 

10ఏళ్ల నుంచి ఒకే నంబర్ వాడుతున్నానని అవసరమైతే తన కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చన్నారు. తాను కామ్ గా ఉంటున్నానని అయితే తనను గెలికితే బాగోదన్నారు. అందరి భాగోతాలు తన దగ్గర ఉన్నాయని అవి బయటపెడితే వారి పిల్లలకు పెళ్లిళ్లు కావంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అపూర్వ. 

ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబును సైతం ప్రశ్నించారు. సీఎం సార్ ఇవేం రాజకీయాలు అంటూ నిలదీశారు. తనకు న్యాయం చెయ్యాలని కోరారు. తాము కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లమేనని అయితే టీడీపీ నేతల ఆగడాలవల్లే పార్టీకి దూరమయ్యామని చెప్పుకొచ్చారు. మెుత్తానికి అపూర్వ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టార్గెట్ చెయ్యడం మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవాలి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చింతమనేని అనుచరులపై సినీనటి అపూర్వ ఫిర్యాదు

కామ్ గా ఉన్నా గెలికారు, జాతకాలు బయటపెడతా: అపూర్వ వార్నింగ్

చింతమనేని అనుచరులపై సినీనటి అపూర్వ ఫిర్యాదు

అపూర్వకు ‘సినీ’ కష్టాలు

మమ్మల్ని వాడుకుంటున్నారు ప్లీజ్ కాపాడండి : నటి అపూర్వ (వీడియో)

రోజూ పబ్ కి వెళ్లేదాన్ని.. బన్నీ కూడా వచ్చేవాడు: నటి అపూర్వ

 

Follow Us:
Download App:
  • android
  • ios