క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను కెరీర్ ఆరంభంలో ఆమె రెగ్యులర్ గా పబ్ కు వెళ్లేవారట. పబ్ కల్చర్ పై అప్పట్లో చాలా మక్కువ ఉండేదని.. తను వెళ్లే పబ్ కు బన్నీ కూడా వచ్చేవాడని చెప్పారు. దీంతో నేను ఎప్పుడైనా.. బన్నీకు కనిపిస్తే ఏంటండీ ఈ మధ్య పబ్ లో కనిపించడం లేదని సరదాగా అడిగేవారని అపూర్వ వెల్లడించింది.

అతడితో అంత సరదాగా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఆ వయసులో పబ్ కి బాగా వెళ్లేవాళ్ళమని ఇప్పుడు మానేసినట్లు స్పష్టం చేసింది. అలానే ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ చాలా గొప్పగా మాట్లాడారు.. ''సెట్ లో ఖాళీగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆడవాళ్లందరినీ కూడా అమ్మా అని పిలుస్తాడు. మంచి అబ్బాయి. రఘుబాబు వంటి నటులతో ఆయనతో ఎంతో సరదాగా ఉంటారు'' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ డాన్స్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని ఎక్కడైనా పార్టీకు వెళ్తే డాన్స్ చేయడం నచ్చుతుందని వెల్లడించారు.