హైదరాబాద్: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యేపై చింతమనేని ప్రభాకర్ అనుచరులపై సినీనటి అపూర్వ రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన క్యారెక్టర్ పై చేస్తున్న కామెంట్లకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే తన క్యారెక్టర్ పై ఎలాంటి విమర్శలు వస్తాయో పట్టించుకోలేదన్నారు. తాను సినీ ఇండస్ట్రీలో ఉంటూ గౌరవంగా బతుకుతున్నానని తెలిపారు. అయితే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనపై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలకు గానూ సినీ నటి అపూర్వ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తన వైవాహిక జీవితంలోకి సైతం వచ్చి అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారంటూ అపూర్వ విరుచుకుపడ్డారు. తన పెళ్లి 1993లో అయ్యిందని కానీ తాను 1999లో అయ్యిందంటూ తన భర్తను వేధిస్తున్నట్లు ప్రెస్మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. 

తనను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భర్త తనకు తెలియకుండా వేరే పెళ్లి చేసుకుని పిల్లలను సైతం కన్నాడని ఆమె ఆరోపించారు. తనను తన భర్త మోసం చేస్తే తాను వేధిస్తున్నానని ఆరోపణలు చెయ్యడం ఎంత వరకు సబబని  నిలదీశారు.

తాను దెందులూరులో ఓ కుటుంబం నివశిస్తున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫలితంగా తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. తాను ఇప్పటి వరకు కామ్ గా ఉన్నానని తనను గెలికారని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 

మరోవైపు తాను బెదిరిస్తున్నానని, ఫోన్లు చేసి ఎస్పీ తెలుసు, పోలీసులు తెలుసు అంటూ తాను నిత్యం వేధింపులకు పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను పదేళ్లుగా ఒకే నంబర్ వాడుతున్నానని కాల్ లిస్ట్ చెక్ చేసుకోవాలని సవాల్ విసిరారు. 

తమపై చేసిన ఆరోపణలు నిజమని రుజువు అయితే నడిరోడ్డుపై ఉరితియ్యాలంటూ సవాల్ విసిరారు. తనను సీత అన్నా పర్వాలేదు, సిల్క్ స్మిత అన్నా పర్వాలేదని తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నానని తెలిపారు. నా వ్యక్తిత్వం గురించి మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 

తనను రెచ్చగొట్టదన్న ఆమె రెచ్చగొడితే ఒక్కొక్కరి జాతకం బయటపెడతానని హెచ్చరించారు. జాతకాల బయటపెడితే నన్న విమర్శించిన వాళ్ల పిల్లలకు పెళ్లి కాకుండా పోతాయ్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

 మరోవైపు తమ కుటుంబం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేదని అయితే టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక బయటకు వచ్చేసినట్లు తెలిపారు. తనపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు చేస్తున్న అంశంపై దృష్టిపెట్టాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 

తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం సార్.. ఏం రాజకీయాలు సార్ ఇవి? ఇదేం ప్రజాస్వామ్యం? మీ నాయకులు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని వాపోయారు. ఇది ఇప్పటికైనా సీఎం చంద్రబాబు దృష్టికెళ్లాలని నాలా ఇంకో ఆడపిల్ల బాధపడకూడదని అపూర్వ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చింతమనేని అనుచరులపై సినీనటి అపూర్వ ఫిర్యాదు

అపూర్వకు ‘సినీ’ కష్టాలు

మమ్మల్ని వాడుకుంటున్నారు ప్లీజ్ కాపాడండి : నటి అపూర్వ (వీడియో)

రోజూ పబ్ కి వెళ్లేదాన్ని.. బన్నీ కూడా వచ్చేవాడు: నటి అపూర్వ