ఒకే రోజు ఒకే జిల్లాలో ఐదుగురు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజు ఐదుగురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ లో ఏకంగా 30వేల మందికిపైగా మహిళలు కనిపించకుండా పోయారంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, కేంద్ర సమాచారం తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో తమ బిడ్డలను ఇళ్లనుంచి బయటకు పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకేరోజు ఐదుగురు అమ్మాయిలు కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదుగురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలోని ఒజిలికి చెందిన నందిని అనే అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు ఎంత గాలించినా లాభం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇక ఇలాగే కుప్పం పట్టణంలో ఇద్దరు అమ్మాయిలు మిస్సయ్యారు. రమ్య, కీర్తి గురువారం ఇళ్లనుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసారు. వారికోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
Read More పల్నాడులో ఇంటర్ యువతి మిస్సింగ్... కన్నీటితో కాలేజీముందు పేరెంట్స్ ఆందోళన (వీడియో)
పీలేరులో సానిఫా, కేవీ పల్లెలో రమ్యశ్రీ అనే మరో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసులు కూడా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఇలా ఒకేరోజు ఐదురుగు అమ్మాయిలు మిస్సవడం... అదికూడా ఒకే జిల్లా పరిధిలో జరగడం కలకలం రేపుతోంది.
ఇదిలావుంటే పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూడా ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మూడ్రోజులుగా కనిపించకుండా పోయింది. నరసరావుపేట చైతన్య జూనియర్ కాలేజీలో వైష్ణవి(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. కాలేజీకి వెళుతున్నానని చెప్పి మూడ్రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన ఆమె ఇప్పటివరకు తిరిగి ఇంటికి చేరుకోలేదు. కూతురు ఆచూకీ కోసం అంతటా గాలించినా పలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. అయినప్పటికీ వైష్ణవి ఆఛూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.