ఇందులో వేసే ప్రతిచెత్త కి ప్రతిఫలం ఉంటుంది. ఈ వేస్ట్ ఎటిఎంలో ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ టీ కప్పులు, కూల్ డ్రింక్ డబ్బాలు వంటి వాటిని వేయగానే అందులోనుండి ఒక కూపన్ వస్తుంది. ఎటిఎం ముందుకు వెళ్లగానే సెన్సార్ ల ద్వారా పురుషులు, మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు.... ఇలా ప్రతి వర్గాన్ని అది గుర్తిస్తుంది. ఆయా వర్గాలకు సంబంధించిన గిఫ్ట్ పథకాలను స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తుంది.
అమరావతిలో కొత్త రకం ఎటిఎం నిన్నటినుంచిపనిచేయడం మొదలుపెట్టింది.
ఇపుడు రాష్ట్రంలో తాండివిస్తున్న నోట్ల కొరత తీర్చేందుకు పెట్టిన ఎటిఎం కాదిది. చెత్త చెదారపు ఎటిఎం. ఇందులో చెత్త వేస్తే గిప్ట్ కూపన్లొస్తాయి. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి పి.నారాయణ ఈ ఎటిఎంని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.
ఇందులో వేసే ప్రతిచెత్త కి ప్రతిఫలం ఉంటుంది. ఈ వేస్ట్ ఎటిఎంలో వేస్ట్ ఎటిఎమ్ ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ టీ కప్పులు, కూల్ డ్రింక్ డబ్బాలు వంటి వాటిని వేయగానే అందులోనుండి ఒక కూపన్ వస్తుంది. ఎటిఎం ముందుకు వెళ్లగానే సెన్సార్ ల ద్వారా పురుషులు, మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు.... ఇలా ప్రతి వర్గాన్ని అది గుర్తిస్తుంది. ఆయా వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను ఎటిఎన్ స్క్రీన్ ద్వారా డిస్ ప్లే చేస్తుంది.
వ్యర్థాలను ఇందులో వేయగానే రెస్టరాంట్లలో,ఫుడ్ కోర్టులలో వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్ తదితర చోట్ల చెల్లుబాటయ్యే కూపన్స్ ను అందిస్తుంది.
ఈ ఎటిఎంకు రెండు వైపులా మిర్రర్ లు, దిగువన షూ పాలిష్ సౌకర్యం కూడా ఉంటుంది. మొబైల్ ఛార్జర్ ఏర్పాటు కూడా ఉంటుంది.
ఇలా మల్టీపర్పస్ వేస్ట్ ఏటిఎమ్ ను నిన్న వెలగపూడి సెక్రెటేరియట్ లో ని మునిసిపల్ శాఖ కార్యాలయం వద్ద మంత్రి నారాయణ ప్రారంభించారు. వేస్ట్ టు వెల్త్ – వేస్ట్ టు హెల్త్ అనే కాన్సెప్ట్ కింద క్రమంగా వీటిని అన్ని మునిసిపాలిటిలలోఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
మొదట విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి, ఫలితాలను బేరీజు వేసుకుని రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ప్రవేశపెడతామని పురపాలక మంత్రి నారాయణ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యర్థాల ను సద్వినియోగ పర్చడంలో భాగంగా వేస్ట్ టు ఎనర్జీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అవలంభిస్తున్నదని ఇందులో భాగంగా రాష్ట్రంలో 64 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 10 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, దేశంలో వేస్ట్ టు ఎనర్జీ విషయంలో మనమే అగ్రగామిగా ఉన్నామని పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు.
