Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో విస్తరిస్తున్న కరోనా... ఉయ్యూరులో మొదటి పాజిటివ్ కేసు

కృష్ణా జిల్లా ఉయ్యూరులో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది.

First case of COVID-19 reported from  uyyuru
Author
Amaravathi, First Published Jun 15, 2020, 12:10 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. శ్రీనివాస కళాశాల సమీపంలోని అవంతిక అపారట్మెంట్స్ లో నివాసముండే 32 సంవత్సరాల అవివాహితకు కరోనా పాజిటివ్ వున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ యువతి విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నట్లు సమాచారం. 

ఆంధ్రప్రదేశ్ కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం రికార్డు  స్థాయిలో 294 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,152కి చేరింది

 కరోనా కారణంగా ఆదివారం ఇద్దరు మరణించంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 84కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,034 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా... 2,723 మంది డిశ్చార్జ్ అయ్యారు.

read more   ఏపిలో కరోనా విజృంభణ... అసెంబ్లీలో అప్రమత్తం

24 గంటల్లో 15,633 మంది నమూనాలు పరీక్షించగా 294 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 39 మంది ఉన్నారు.

కాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకింది.హైదరాబాదులోని చంద్రబాబు నివాసం వద్ద అతను ఇటీవల విధులు నిర్వహించాడు. అనంతరం గుంటూరు జిల్లా బాపట్లకు వచ్చాడు. ప్రస్తుతం బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్ లో పనిచేస్తు్ననాడు. 

మే 5వ తేదీన డ్యూటీపై అతను హైదరాబాదు వెళ్లి ఈ నెల 7వ తేదీన తిరిగివచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు.శనివారం వచ్చిన ఫలితాల్లో అతనికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాదులోని తోటి కానిస్టేబుల్ నుంచి అతనికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios