ఏపీ మందు తాగుతున్నా... నాకు ఏదైనా అయితే మరిచిపోవద్దు..: యాక్టర్ శ్రీకాంత్ సెటైర్లు (వీడియో)
ఆంధ్ర ప్రదేశ్ లో లభించే కొత్త కొత్త మద్యం బ్రాండ్స్ పై ఇప్పటికే ట్రోలింగ్ జరుగుతుండగా తాజాగా సీనినటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సెటైరికల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో లభించే మద్యంపై ఇప్పటికే అనేక అపోహలు ప్రచారంలో వున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాదకరమైన మద్యం బ్రాండ్స్ అమ్మకాలకు అనుమతి ఇచ్చారని... ఇవి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తన స్వలాభం కోసం జగన్ ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నాడని మండిపడుతున్నారు. మార్కెట్ లో బాగా సేల్ అయ్యే మద్యం బ్రాండ్స్ కాకుండా ఏపీలో కొత్త కొత్త పేర్లతో అమ్ముతుండటం ప్రజల్లోనూ అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఏపీలో లభించే మద్యంపై దుమారం రేగుతున్న వేళ సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ షాకిచ్చారు. ఏపీ మద్యంపై శ్రీకాంత్ సెటైరికల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓ చేతితో సిగరెట్, మరో చేతిలో బూమ్ బూమ్ బీర్ బాటిల్ ను చూపిస్తూ యాక్టర్ శ్రీకాంత్ సెటైర్లు వేసారు. మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూనే... ఏపీ మద్యం ఇంకెంతో హానికరం అనేలా శ్రీకాంత్ కామెంట్స్ చేసారు. బూమ్ బూమ్ బీర్ తాగుతూ తనకు ఏమవుతుందో తెలీదు... తనను మరిచిపోకుండా గుర్తుపెట్టుకోండని శ్రీకాంత్ అన్నారు. ఇలా నటుడు శ్రీకాంత్ సరదాగానే మాట్లాడుతూ ఏపీ మద్యం ప్రమాదకరమని చెప్పకనే చెప్పారు.
వీడియో
''నేను బెజవాడలో వున్నారు. కొద్దిగా డిప్రెషన్ గా వుంటే బీరు తెచ్చుకున్నాను. నేను తెచ్చుకున్నది మామూలు బీర్ కాదు (బూమ్ బూమ్ బీర్ బాటిల్ చూపిస్తూ). ఇంట్లోవాళ్లకు, మిత్రులు ఎవ్వరికీ చెప్పలేదు... మీకే చెబుతున్నా. ఇది తాగుతున్నాను కానీ ఏమవుతుందో తెలీదు. ఏమయినా నన్ను మరిచిపోకుండా గుర్తుపెట్టుకొండి'' అంటూ సినీనటుడు శ్రీకాంత్ ఏపీ మద్యంపై సెటైర్లు వేసారు.
Read More అక్టోబర్ 1న ఉదయనిధిని చెప్పుతో కొడతా...: ఏపీ జన జాగరణ సమితి కన్వీనర్ వార్నింగ్ (వీడియో)
ఇదిలావుంటే ఇటీవల కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణానికి కూడా ఏపీ మద్యమే కారణమంటూ ప్రచారం జరిగింది. ఓ కార్యక్రమం కోసం కొద్దిరోజులు ఏపీలో వుండివచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ సడన్ గా చనిపోయారు. దీంతో రోజూ మద్యం తాగే అలవాటున్న ఆయన ఏపీలో లభించే మందు తాగారని... దీంతో ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయాడంటూ ప్రచారం జరిగింది.
తాజాగా నటుడు శ్రీకాంత్ ఏపీ మద్యం తాగితే ఏమవుతుందోనని కంగారు పడుతూ చేసిన వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన సరదాగానే వీడియో చేసినా దీన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకునే జగన్ సర్కార్ ను విమర్శించే అవకాశం వుంది.