Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్ 1న ఉదయనిధిని చెప్పుతో కొడతా...: ఏపీ జన జాగరణ సమితి కన్వీనర్ వార్నింగ్ (వీడియో)

సినీ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను అక్టోబర్ 1న చెప్పుతో కొడతానని ఏపీ జన జాగరణ సమితి కన్వీనర్ వాసు హెచ్చరించాడు.  

AP Janajagarana Samithi convenor annouced slapping Udayanidhi with slipper AKP
Author
First Published Sep 12, 2023, 10:07 AM IST

విజయవాడ : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిజెపితో పాటు హిందూ, ధార్మిక  సంఘాలు ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో వుండి దేశంలోని మెజారిటీ ప్రజల మనోబావాలు దెబ్బతీసేలా కామెంట్స్ చేసిన   ఉదయనిధి మంత్రివర్గం నుండి తొలగించాలని కొందరు,  మరికొందరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అయోధ్య స్వామీజీ పరమహంస ఆచార్య అయితే ఉదయనిధి తల నరికిన వారికి రూ.10 కోట్ల నగదు బహుమానం ఇస్తానంటూ సంచలన ప్రకటన చేసారు. తాజాగా ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యల సెగ విజయవాడను తాకింది. 

ఉదయనిధి స్టాలిన్ ను చెప్పుతో కొట్టినవారికి రూ.10 లక్షల నగదు బహుమతిని అందిస్తామని ఏపీ జనజాగరణ సమితి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తానే స్వయంగా ఉదయనిధిని చెప్పుతో కొడతానని జనజాగరణ సమితి ఏపీ కన్వీనర్ వాసు ప్రకటించాడు. అక్టోబర్ 1 న తమిళనాడు సీఎం కొడుకును చెప్పుతో కొట్టి ఆవేదనతో బాధపడుతున్న హిందువులు హృదయాలకు కాస్తంత ఉపశమనం కల్పిస్తానని అన్నారు. ఉదయనిధిని బుద్దిచెప్పేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు వాసు తెలిపాడు.  

వీడియో

గతంలో నుపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఎలాగయితే స్పందించిందో ఉదయనిధి వ్యాఖ్యలపైనా అలాగే స్పందించాలని వాసు కోరారు.యావత్ హిందూ సమాజం పాటించే సనాతన ధర్మాన్ని అవమానించిన ఉదయనిధి బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు జన జాగరణ సమితి కన్వీనర్ వాసు. 

Read More  సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియానే కాదు.. హెచ్ఐవీ లాంటిది కూడా - డీఎంకే ఎంపీ ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

ఇదిలావుంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ను చెప్పుతో కొట్టినవారికి రూ.10 లక్షల బహుమతి ఇవ్వబడును అంటూ ఇటీవల విజయవాడలోప్లెక్సీలు వెలిసాయి. ఉదయనిధి ఫోటోను చెప్పతో కొడుతున్నట్లుగా వున్న ప్లెక్సీని జన జాగరణ సమితి ఏర్పాటుచేసింది. ఈ ప్లెక్సీలు విజయవాడలోని ప్రధాన కూడళ్ళు, రోడ్ల పక్కన దర్శనమిచ్చాయి. వీటిని స్థానిక ప్రజలు, వాహనదారులు ఆసక్తిగా చూసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios