సాధారణ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాష్ట్ర రాజకీయాలు మంచి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఎటు తిరిగీ ఎత్తులు, పై ఎత్తులు సహజమే. కానీ ఓ సీటు కోసం మిత్రపక్షాల మద్యే పోటీ మొదలైందన్నది పార్టీలో వినిపిస్తున్న ప్రచారం. అందులోనూ ఓ కీలక సీటు కోసం ఎన్టీఆర్ వారసుల మధ్యే  పోటీ మొదలైందన్న వార్తలు ఆసక్తిగా మారుతున్నాయి.

సాధారణ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాష్ట్ర రాజకీయాలు మంచి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఎటు తిరిగీ ఎత్తులు, పై ఎత్తులు సహజమే. కానీ ఓ సీటో కోసం మిత్రపక్షాల మద్యే పోటీ మొదలైందన్నది పార్టీలో వినిపిస్తున్న ప్రచారం. అందులోనూ ఓ కీలక సీటు కోసం ఎన్టీఆర్ వారసుల మధ్యే పోటీ మొదలైందన్న వార్తలు ఆసక్తిగా మారుతున్నాయి.

ఇంతకీ ఆ సీటేదనుకుంటున్నారా? ఇంకేముంటుంది ? అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్ సభ స్ధానం. పార్టీ ఏర్పాటైన దగ్గర నుండి ఈ స్ధానం టిడిపికి ఎంతటి కంచుకోటో అందరికీ తెలిసిందే కదా? టిడిపి నుండి ఎవరైనా సరే నామినేషన్ వేస్తే చాలు గెలిచినట్లే. అటువంటిది ఎన్టీఆర్ వారసులే పోటీ చేస్తామంటే ఇక చెప్పేదేముంది? అందుకనే బాగా ఆలోచించుకునే ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సీటుపై కన్నేసారని సమాచారం.

వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుండే ఎంపిగా పోటీ చేయబోతున్నట్లు ఆమే స్వయంగా ప్రకటించారు. పోటీ చేయటానికి హిందుపురం సీటు తప్ప మరోటి లేదు. అనంతపురం సీటు జోలికి ఎటూ వెళ్ళ లేరు. అందుకని హిందుపురం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల కిష్టప్పను ఎంఎల్ఏగా పోటీ చేయమంటే ఆయనేమీ కాదనే వ్యక్తి కాదు. భాజపా-టిడిపిల మద్య పొత్తుంటే సీటును భాజపా తీసుకోవాలన్నది పురంధేశ్వరి ప్లాన్. ఒకవేళ పొత్తు లేకపోతే సమస్యే లేదు. నేరుగా భాజపానే పోటీ చేయవచ్చు. ఈ విషయంపై రెండు పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.

అయితే, ఇక్కడే పురంధేశ్వరికి ఊహించని ట్విస్ట్ ఎదురైనట్లు టిడిపిలో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ కూడా ఈ సీటుపైనే కన్నేసినట్లు సమాచారం. అంటే ఎన్టీఆర్ వారసుల్లోనే హిందుపురం పార్లమెంటు విషయంలో పోటీ తప్పదనిపిస్తోంది. సరే, హరికృష్ణ సంగతి ఎలాగున్నా పురంధేశ్వరి మాత్రం తరచూ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా? అంటే పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారనే అనుకోవాలి. ఇక నిమ్మల విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో పెనుగొండ లేదా పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఏం జరుగుతుందో చూడాలి.