విశాఖపట్నం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతురునే కాటేశాడో కసాయి తండ్రి. అభం శుభం తెలియని మైనర్ కూతురిపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడగా బాలిక గర్భందాల్చింది. ఈ దారుణం విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం రైల్వే కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రీషన్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య చనిపోవడంతో మైనర్ కూతురు, మంచానపడిన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే అతడు నిత్యం మద్యం సేవించి వచ్చి కూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడు. దీంతో బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం గురించి బయటపడింది. 

read more   పెళ్లిచేసుకోను... వేరెవ్వరినీ చేసుకోనివ్వను: ప్రియుడి సైకో చేష్టలకు యువతి బలి

మంగళవారం బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో కేజీహెచ్ కు తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు గర్భం దాల్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు నెలల గర్భవతి అని తెలిపారు. పెళ్లికాకుండానే మైనర్ బాలికకు గర్భం రావడంతో డాక్టర్లే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హాస్పిలట కు చేరుకుని బాలికను  ప్రశ్నించగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయపడింది. 

బాలిక  తెలిపిన వివరాల ప్రకారం తండ్రే ఈ దారుణానికి కారణమని నిర్దారించుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు స్థానిక పోలీసులు.