కర్నూల్ జిల్లా నంద్యాలలో ఘటన
కన్నకొడుకనే కనికరం కూడా లేకుండా ఓ వ్యక్తి తన మొదటి భార్య కుమారిడిని ఇంట్లోనే బంధించి నరకం చూపాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగింది.
సల్మాన్ భార్య ఇటీవలే చనిపోయింది. వారికి ఇద్దరు సంతానం. రిహాన్ వారి చిన్న కుమారుడు. అయితే భార్య చనిపోవడంతో సల్మాన్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వేరే ఇంట్లో పెట్టాడు.
ఈ నేపథ్యంలో ఐదు రోజుల కిందట తన మొదటి భార్య కుమారుడైన రిహాన్ ను ఇంట్లోనే బంధించి రెండో భార్య ఇంటికి వెళ్లాడు.తాళం వేసిన ఇంటిలో ఆ చిన్నారి ఒక్కడే బిక్కు బిక్కు మంటూ ఐదు రోజులు గడిపాడు. అయితే కరెంట్ బిల్లు కోసం విద్యుత్ సిబ్బంది ఆ ఇంటికి రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులుకు ఫోన్ చేశారు. పొలిసులు ఇంటి తాళాన్ని పగల గొట్టి రెహాన్ ను బయటి తీసుకోవచ్చారు. కర్కశంగా వ్యవహరించిన అతని తండ్రి కోసం గాలిస్తున్నారు.
