వివాహితపై సొంత సోదరుడి అత్యాచారయత్నం, ఉరివేసి చంపిన తండ్రి....

Father kills son for attempting to rape sister
Highlights

పాపం...భర్త చనిపోవడంతో పుట్టింటికి చేరిన ఓ వివాహితపై సొంత సోదరుడే అత్యాచారయత్నం చేశాడు. తాగిన మైకంలో సొంత కొడుకే కూతురిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండటంతో వారి తండ్రి కొడుకును నిలువరించే ప్రయత్నం చేశాడు. అయినా అతడు వినకపోవడంతో సహనం కోల్పోయిన తండ్రి కొడుకును దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా రాజమండ్రిలో జరిగింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన చంద్రశేఖర్(30) మద్యానికి బానిసయ్యాడు. దీంతో నిత్యం ఫుల్లుగా తాగి వచ్చి భర్త చనిపోవడంతో పుట్టింట్లోనే ఉంటున్న చెల్లిని దుర్భాశలాడుతూ హింసించేవాడు. ఆమెపై భౌతిక దాడులకు దిగేవాడు. 

ఇదేవిధంగా ఇవాళ కూడా చంద్ర శేఖర్ ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న చెల్లిపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. చెల్లిని రేప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో తండ్రి ఇంటికి చేరుకున్నాడు.కొడుకు చేస్తున్న దారుణాన్ని గుర్తించి సముదాయించే ప్రయత్నం చేశాడు. తండ్రి ఎంత చెప్పినా వినకుండా అతడి ముందే శేఖర్ చెల్లిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆవేశానికి లోనైన వారి తండ్రి కొడుకు మెడకు ఓ తాడును బిగించాడు. దీంతో ఊపిరాడక చంద్రశేఖర్ మృతి చెందాడు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రిపై కేసు నమోదు చేశారు. ఈ హత్యలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
loader