భార్య కాపురానికి రావడం లేదని.. ముగ్గురు పిల్లలను నదిలో పడేసిన తండ్రి

father kills his three sons at chittoor district
Highlights

భార్యపై కోపంతో ముగ్గురు పిల్లలను నదిలో పడేశాడో కసాయి తండ్రి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాలగంగనపల్లికి చెందిన వెంకటేశ్‌కు భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై కోపంతో తన ముగ్గురు పిల్లలను చంపి నదిలో పడేశాడో కసాయి  తండ్రి. గంగాధర నెల్లూరు మండలం శెట్టిగారిపల్లెకు చెందిన వెంకటేశ్, అమరావతిలకు ఏడేళ్ల  క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసైన వెంకటేశ్ భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో అమరావతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో అత్తగారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాల్సిందిగా కోరగా.. అందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేశ్ పీకలదాకా మద్యం తాగి.. గత రాత్రి తన ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్ళి నీవా నదిలో పడేసి చంపేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పునీత్(5), సంజయ్(3), రాహుల్(2)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

loader