వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య.. భర్తకు మటన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి వడ్డించింది. అతను పడుకున్నాక ప్రియుడిని పిలిచి చంపించాలని చూసింది. 

విజయనగరం : ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరంలో ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తని కడతేర్చాలని చూసింది ఓ భార్య. దీనికోసం అతడు తినే అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మెడకు ఉరివేసి చంపాలని ప్రయత్నించింది.. కాకపోతే.. భర్తకు మధ్యలోనే తెలివి రావడంతో ప్రియుడుతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఆ తర్వాత ప్రియుడుతో కలిసి జైలుకు వెళ్ళింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఓ భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దీనికి భర్త అడ్డుగా ఉన్నాడని తొలగించుకోవాలని చూసింది. దీంట్లో బాగంగానే భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి వడ్డించింది. ఆ బిర్యానీ తిన్న భర్త నిద్రలోకి జారుకోగానే తన ప్రియుడిని పిలిపించింది.

భార్యను లవర్ తో బెడ్ మీద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త... ఏం చేశాడంటే..

ఆ తర్వాత ఇద్దరూ కలిసి భర్త మెడకు నైలాన్ తాడు బిగించి హత్య చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో భర్తకు అనుకోకుండా తెలివి వచ్చింది. ఒక క్షణం తనకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే భయంతో గట్టిగా కేకలు వేశాడు. భర్త మెడకు తాడు వేసి చంపడానికి ప్రయత్నిస్తున్న ప్రియుడు, భార్య అక్కడి నుంచి పారిపోయారు.

వెంటనే తేరుకున్న భర్త అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. అలా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని మీద టూ టౌన్ సిఐ సిహెచ్ లక్ష్మణరావు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు.

స్థానికంగా ఉన్న కుమ్మరి వీధికి చెందిన కోటరాజు, శ్రీదేవి భార్యాభర్తలు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవికి గత కొంతకాలంగా చినగోకవీధికి చెందిన గంధవరపు రఘుతో వివాహేతర సంబంధం ఉంది. సంబంధానికి భర్త.. అడ్డుగా ఉన్నాడని అతడిని చంపాలని ప్రియుడుతో మాట్లాడింది. దీనికి అతను తనకు తెలిసిన ఆర్ఎంపీడాక్టర్ దగ్గరనుంచి నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చాడు. 

వాటిని శ్రీదేవి బుధవారం రాత్రి మటన్ బిర్యానీలో కలిపి భర్తకు తినిపించింది. రాజు నిద్ర పోయాక... రఘుకు ఫోన్ చేసి పిలిచింది. అతను తనతో పాటు కేత శ్రీను అనే బంధువును తీసుకుని వచ్చాడు. అతనితో రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

వారు తమతో తెచ్చుకున్న నైలాన్ తాడును రాజు మెడకు బిగించి, చంపడానికి ప్రయత్నించారు. అయితే, రాజుకు మెలుకువ రావడంతో కథ అడ్డంతిరిగింది. పెద్దగా కేకల వేయడంతో ఇద్దరూ అక్కడినుంచి పారిపోయారు. భార్య శ్రీదేవి, ప్రియుడు రఘు, అతనికి సహకరించిన శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.