150 పశువులు అమరావతిని నాశనం చేస్తున్నాయి: వైసీపీపై బొండా తీవ్ర వ్యాఖ్యలు
వైసీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. 150 పశువులు రాజధానిని నాశనం చేస్తున్నాయని విమర్శించారు.
వైసీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. 150 పశువులు రాజధానిని నాశనం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబుపై కక్షతోనే వైసీపీ నేతలు అమరావతిని శ్మశానంతో పోలుస్తున్నారని బొండా మండిపడ్డారు.
కొడాలి నాని దున్నపోతులు, పందులు అమరావతికి వస్తున్నాయన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజధాని అమరావతిని స్మశనంతో పోల్చడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని... గురువారం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారని ఆయన తెలిపారు.
Also Read:క్షుద్రపూజల కలకలం: శ్రీకాళహస్తి ఏఈవో అరెస్ట్
టీడీపీ హయాంలో పరిపాలన భవనాలు, హైకోర్టును పూర్తిచేస్తామని బొండా స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం రాజధానిని స్మశానంగా మార్చాలని చూస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని బూతుల మంత్రని, స్పీకర్ కూడా బూతుల స్పీకర్‌గా మారిపోయారని... వైసిపి మంత్రులు భాషను అదుపులో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు.
బూతులకు కూడా వైసిపి ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖను పెడుతుందా అని ఉమా ప్రశ్నించారు. వైసిపి కార్యలర్తలను, కిరాయి మనుషులను తీసుకొచ్చి అమరావతిలో ఈరోజు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రెండు లక్షల కోట్ల అవినీతి అన్న వైసిపి, రెండు లక్షల అవినీతి అయినా బయటపెట్టగలిగిందా అని ఉమా ప్రశ్నించారు.
వైసిపి చేతకానితనంతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని... వైసిపి అహంకారాన్ని, అజ్ఞానాన్ని ప్రజలకు చూపించాలని టిడిపి తీసుకున్న నిర్ణయంతోనే సిఆర్డిఏలో కదలిక వచ్చిందని బొండా వెల్లడించారు.
సిఎం జగన్ ఒక వర్గాన్ని అణచడానికే అమరావతిని నాశనం చేయడానికి చూస్తున్నారని.. అమరావతిని ప్రజా ఉద్యమంతో అయినా సాధించి తీరుతామని బొండా ఉమా స్పష్టం చేశారు.
మంగళవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. రాజధాని ప్రాంతంలో నాలుగు బిల్డింగులు, ముళ్లపొదలు తప్ప ఏమున్నాయని నాని ప్రశ్నించారు.
వాటిని చూసేందుకే చంద్రబాబు వెళ్తున్నారా అని ఆయన నిలదీశారు. గత ఐదేళ్లలో సమీక్షలు తప్ప చంద్రబాబు ఏం చేయలేదని.. వైసీపీని విమర్శించడం మాని ఎందుకు ఓడామో సమీక్షించుకోవాలని నాని సూచించారు.
హైదరాబాద్ తరహా రాజధానిని నిర్మిస్తామని చెప్పి బాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పొరపాట్లే మేం కూడా చేయాలా అని నాని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో ఇల్లే కట్టలేం.. అలాంటిది రాజధాని కట్టగలమా అని ఆయన నిలదీశారు.
Also Read:జగన్ ఇలాఖాలోనే ఇదీ పరిస్థితి...మంచి సీఎం అంటే ఇదేనా...?: చంద్రబాబు
సాయంత్రం 6 గంటల తర్వాత అమరావతిలో స్మశాన నిశ్శబ్ధం ఉంటుందని బొత్స అన్నారన్నారు. వైఎస్ కుటుంబాన్ని విమర్శించుకోవాలని చెప్పినా చంద్రబాబు వినలేదని.. బాబు వల్లే తాము కూడా ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సి వస్తోందని నాని గుర్తు చేశారు.