క్షుద్రపూజల కలకలం: శ్రీకాళహస్తి ఏఈవో అరెస్ట్
ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి సమీపంలోని వేడం కాలభైరవ ఆలయంలో అర్థరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి సమీపంలోని వేడం కాలభైరవ ఆలయంలో అర్థరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.
వారు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈవో ధన్‌పాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం సింహాచలం ఆలయానికి సమీపంలోని భైరవకోనలోని భైరవస్వామి ఆలయంలో రెండు గంటల పాటు పూజలు, హోమాలు జరిగిన ఘటన దుమారాన్ని రేపింది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి సింహాచలం దేవస్థానం కార్య నిర్వాహణాధికారి కె. రామచంద్ర మోహన్ గా పేర్కొంటున్నారు.
Also Read:Read Also: సింహాచలం ఆలయంలో అర్థరాత్రి క్షుద్రపూజలు
ఆయన తన బంధువుల కోసం ఆలయంలో హోమాలు,పూజలు నిర్వహించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈవో ఆదేశాలపై సింహాచలానికి చెందిన ఐదుగురు పండితులు భైరవస్వామి ఆలయానికి వచ్చి వింత పూజలు జరిపినట్లు సమాచారం.
స్వామి దర్శనానికి వచ్చిన భక్తులను లోపలికి రానీయకుండా,.. బయటనే ఉంచి తాళాలు వేసిమరీ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమావాస్య వేళల్లో భైరవస్వామిని దర్శించుకోవడానిక భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. వారిని స్వామివారిని దర్శించుకోనివ్వకుండా ఇలా చేయడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.