Asianet News TeluguAsianet News Telugu

పవన్ శ్వాస పీల్చేది.. వదిలేది చంద్రబాబు కోసమే , డబ్బులు లేవంటూ ఛార్టెట్ ఫ్లైట్స్‌లో జర్నీలా : పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు నువ్వు, చంద్రబాబు కలిసి ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా కట్టారా అని పేర్ని నాని నిలదీశారు. పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు పంచిన డబ్బు కంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువని పేర్ని నాని ఆరోపించారు.

ex minister perni nani slams janasena chief pawan kalyan on visakha fishing harbour fire accident issue ksp
Author
First Published Nov 25, 2023, 4:44 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నటన మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా వుందన్నారు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. జనసేన ఆవిర్భావం నుండి నేటి వరకు చంద్రబాబు కోసమే పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని పేర్ని నాని తెలిపారు. 

ప్రమాదం జరిగిన మరుసటి రోజే బాధిత మత్స్యకారులకు పరిహారం అందించామని ఆయన వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి చేసింది శూన్యమని పేర్నినాని దుయ్యబట్టారు. ఒక్క హార్బర్ గానీ, ఒక్క జెట్టీని గానీ నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాటలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయని పేర్ని నాని చురకలంటించారు. ఐదేళ్లలో తన అవసరాల కోసం చంద్రబాబు ఎన్ని వందల కోట్ల రూపాయాలు ఖర్చు చేశారో నీ కళ్లకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. 

ALso Read: వైసీపీ మళ్లీ గెలిస్తే.. ఇలాంటి బోటు ఘటనలే జరుగుతాయి : విశాఖ హార్బర్‌లో పవన్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు పంచిన డబ్బు కంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువని పేర్ని నాని ఆరోపించారు. పవన్ తన దగ్గర డబ్బులు లేవని చెబుతున్నాడరని.. మరి డబ్బులు లేకుంటే ఛార్జెట్ ఫ్లైట్‌లో ఎలా వస్తారని పేర్ని నాని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారిందని, జగన్ వచ్చాకే 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. పవన్ నిద్రలేచే సరికే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు జగన్ అండగా నిలిచారని పేర్నినాని తెలిపారు. మత్స్యకారులకు రూ.7 కోట్ల 11 లక్షల పరిహారం అందజేసిందని.. పవన్ కళ్యాణ్ రూ.50 వేలు ఇచ్చి రూ.50 కోట్లు ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. 

2014 నుంచి 2019 వరకు నువ్వు, చంద్రబాబు కలిసి ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా కట్టారా అని పేర్ని నాని నిలదీశారు. కాపులను పవన్ ఏనాడైనా మనుషుల్లా చూశాడా.. వారిని పెట్టుబడిగా, ఆస్తిగా, టోకుగా చంద్రబాబుకు బేరం పెట్టడానికే పవన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. విమానం రానివ్వపోవడానికి వైసీపీకేం పని అని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమేనని.. బాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే జనసేనాని పనిచస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios