సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖలో జరిగిన బోటు ఘటనలు పునరావృతమవుతాయని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇంకో నాలుగు నెలల్లో ఇక్కడ పూర్తి భద్రతా ప్రమాణాలతో హార్బర్‌ను తీసుకొచ్చే బాధ్యత జనసేనదేనని పవన్ హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖలో జరిగిన బోటు ఘటనలు పునరావృతమవుతాయని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోయి.. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులకు ఆయన శుక్రవారం రూ.50 చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ.. అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం బాధాకరమన్నారు.

ప్రత్యేక పరిస్ధితుల్లో విశాఖ రావాల్సి వచ్చిందని.. మీకు కష్టం వస్తే జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు వున్నారని భరోసానిచ్చారు. దీనిలో భాగంగా ఇవాళ రూ.30 లక్షలను మత్స్యకార సోదరులకు అందించామని పవన్ చెప్పారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ 1976లో ప్రారంభమైందని.. 700 మరబోట్ల కార్యకలాపాలకు వేదికగా నిలుస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.

ALso Read: Vizag Fishing Harbour: వైజాగ్ హార్బ‌ర్ అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు రూ.7.11 కోట్ల పరిహారం

వైసీపీ మాదిరిగా తాము మత్స్యకారులను ఓటు బ్యాంక్‌గా చూడలేదన్నారు. తెలంగాణలో జనసేన అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తూ .. అన్ని పనులు మానుకుని ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. ఇంకో నాలుగు నెలల్లో ఇక్కడ పూర్తి భద్రతా ప్రమాణాలతో హార్బర్‌ను తీసుకొచ్చే బాధ్యత జనసేనదేనని పవన్ హామీ ఇచ్చారు. త్రిముఖ పోటీ వుంటే విజయాలు సాధించలేమని.. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.