నంద్యాలలోని ఎస్పీజి గ్రౌండ్ లో జరుగనున్న బహిరంగసభకు జనాలు ఇప్పటికే పోటెత్తారు. నియెజకవర్గంలోనే కాకుండా ఆళ్ళగడ్డ తదితర ప్రాంతాల నుండి జనాల పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఉపఎన్నికలో గెలవటమన్నది రెండు పార్టీలకు ప్రతిష్టగా మారిన నేపధ్యంలో జగన్ మొదటిసారి నంద్యాలలో అడుగుపెడుతున్నారు.

నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి హీటెంక్కించేసారు. బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా జగన్ వైసీపీ అభ్యర్ధి శిల్పామోహన్ రెడ్డి తరపున గురువారం ప్రచారానికి దిగినట్లైంది. నంద్యాలలోని ఎస్పీజి గ్రౌండ్ లో జరుగనున్న బహిరంగసభకు జనాలు ఇప్పటికే పోటెత్తారు. నియెజకవర్గంలోనే కాకుండా ఆళ్ళగడ్డ తదితర ప్రాంతాల నుండి జనాల పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఉపఎన్నిక అనివార్యమని తేలిపోయినప్పటి నుండి ఇటు టిడిపి అటు వైసీపీలు ప్రచారంతో నియోజకవర్గాన్ని హోరెత్తించేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. రాష్ట్ర రాజకీయాల్లో నంద్యాలే ఇపుడు కేంద్రబిందువైపోయింది. ఈ ఉపఎన్నికలో గెలవటమన్నది రెండు పార్టీలకు ప్రతిష్టగా మారిన నేపధ్యంలో జగన్ మొదటిసారి నంద్యాలలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించిన విషయం అందరూ చూసిందే.

బహిరంగ సభ వీలైతే రోడ్డుషో కూడా జరపాలన్నది వైసీపీ ఆలోచన. అంతేకాకుండా నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించటంతో పాటు పలు రోడ్డు షోలతో ప్రచారాన్ని హోరెత్తించేయాలన్నది వైసీపీ ఆలోచన. బహిరంగ సభల్లోను రోడ్డుషోల్లోను పాల్గొన్న వారందరూ ఆయా పార్టీలకే ఓట్లేస్తారన్న గ్యారెంటీ ఏమీ లేదు. కాకపోతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారి ఓట్లను వేయించుకోగలిగితేనే అభ్యర్ధికి ఉపయోగముంటుంది. నంద్యాలలో వైసీపీకి కూడా అదే సూత్రం వర్తిస్తుంది.