మొబైల్ ఫోన్ కోసం గొడవ.. స్నేహితుడిని ఇటుకతో కొట్టిచంపిన మైనర్...
మొబైల్ ఫోన్ విషయంలో చెలరేగిన వివాదంలో ఓ వ్యక్తిని అతని స్నేహితుడు కొట్టి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ : యూపీలోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. చిన్నచిన్న కారణాలకే హత్యల వరకూ వెడుతున్న ఘటనలకు ఇదో ఉదాహరణగా నిలిచింది. మొబైల్ ఫోన్ విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తిని అతని స్నేహితుడు దారుణంగా కొట్టి చంపాడు. నిందితుడు మైనర్ అని, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలుడు తన స్నేహితుడైన షకీర్ మొబైల్ ఫోన్‌ను దొంగిలించి విక్రయించాడు. షకీర్ తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని బాలుడిని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. షకీర్ తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని బాలుడిని మరోసారి కోరగా, డబ్బు లేదని అతను నిరాకరించాడు. కొద్దిసేపటికే గొడవ జరిగి నిందితుడు షకీర్‌పై ఇటుకతో దాడి చేయడంతో అతడి మృతి చెందాడు.
తమిళనాడులో రౌడీషీటర్ ఎన్ కౌంటర్....
"షకీర్, నిందితుడు ఇద్దరూ మద్యానికి బానిసలు. మద్యం సేవించే సమయంలో మొబైల్ ఫోన్ గురించి వివాదం తీవ్రమైంది. ఇది షకీర్ మరణానికి దారితీసింది" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు, కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసు కస్టడీలో ఉంచారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్న చెరుకుతోటలో 13 ఏళ్ల బాలిక చిధ్రమైన మృతదేహం లభ్యమైంది. ఆ బాలికను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లుగా కనిపిస్తుంది. ఆ బాలిక ఉదయం పాఠశాలకు వెళ్లి, తిరిగా రాలేదు. దీంతో రాత్రి వరకు ఎదురుచూసిన తల్లిదండ్రులు, అన్ని చోట్లా వెతికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిమీద ఫిర్యాదు నమోదు చేయలేదు.
మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక కళ్లను బయటకు పీకారని, చిత్రహింసలకు గురిచేసినట్లుగా కనిపిస్తుందని తెలిపారు. ఆ తరువాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించి ఫిర్యాదు నమోదు చేశారు.
Operation Ajay: యుద్దంలో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు 'ఆపరేషన్ అజయ్' కి శ్రీకారం
లఖింపూర్ ఖేరీ పోలీసు సూపరింటెండెంట్ (SP) గణేష్ ప్రసాద్ సాహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశోధించి, మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని బాధితురాలి తల్లి ఆరోపించారు. పోలీసులు తన ఫిర్యాదును సకాలంలో నమోదు చేసి ఉంటే, రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బాలికను రక్షించగలిగేవారని ఆమె అన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ, “ప్రాథమికంగా, చాలా గాయాల గుర్తులు కనిపిస్తున్నందున, బాలికను కొట్టి చంపినట్లు కనిపిస్తోంది, అయితే పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత వాస్తవాలు తెలుస్తాయన్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌ల నుండి కూడా నిఘా బృందాలను ఈ కేసును చేధించడానికి నియమించాం. నిజంగా జరిగిందేమిటో కనిపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నాం. కుటుంబ సభ్యులతో మాట్లాడాం. వారు ప్రస్తుతం ఎవరి మీదా అనుమానాలు వ్యక్తం చేయడం లేదు”అన్నారాయన.