ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై బాబు ఆగ్రహం: వదులుకొనేందుకైనా సిద్దమే

First Published 27, Jul 2018, 3:26 PM IST
don't violate party discipline says Chandrababunaidu
Highlights

 అధికారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించే వారిని  వదులుకొనేందుకు కూడ  తాను సిద్దంగా ఉన్నానని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పేశారు. 

అమరావతి: అధికారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించే వారిని  వదులుకొనేందుకు కూడ  తాను సిద్దంగా ఉన్నానని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పేశారు. 

శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన  అమరావతిలో  పార్టీ  సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో  పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశంపై  చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడ ఈ సమావేశంలో  చర్చించారు. 

టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వ్యవహరిస్తున్న తీరుపై  ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో  అధికారులను టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు దుర్భాషలాడడంపై బాబు మండిపడ్డారు. మరోవైపు పెందుర్తి ఎమ్మెల్యే వెంకటేష్ కూడ  అధికారుల తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేయడంపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ విషయమై  ఎమ్మెల్యేల తీరుపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని బాబు హెచ్చరించారు. మరో వైపు పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎవరినైనా వదులుకొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

ఈ వార్తలను చదవండి:టీడీపీతో పొత్తు: తేల్చేసిన ఏపీకాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి

మన సంపద మనకే దక్కాలి: కేంద్రంపై పోరాటానికి బాబు పిలుపు

జగన్ ట్రాప్‌లో పడలేదు, కేసీఆర్‌ను మోడీ పొగిడితే నాకేం కాదు: బాబు

 

 


 

loader