Asianet News TeluguAsianet News Telugu

జగన్ ట్రాప్‌లో పడలేదు, కేసీఆర్‌ను మోడీ పొగిడితే నాకేం కాదు: బాబు

 రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎన్నడూ కూడ రాజీపడబోమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తనపై కేసులను మాఫీ చేసేందుకే ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏతో వైఎస్ జగన్ రాజీపడ్డారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అందుకే కేంద్రంపై పోరాటానికి వైసీపీ సిద్దంగా లేదన్నారు.

Ap chief minister Chandrababunaidu slams on Bjp and Ysrcp leaders

ఏలూరు: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎన్నడూ కూడ రాజీపడబోమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తనపై కేసులను మాఫీ చేసేందుకే ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏతో వైఎస్ జగన్ రాజీపడ్డారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అందుకే కేంద్రంపై పోరాటానికి వైసీపీ సిద్దంగా లేదన్నారు.  ప్రతి శుక్రవారం నాడు కోర్టులకు హజరై జగన్ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసులకు భయపడే జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని చెప్పారు. 

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నగర దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాల హయంలో 14 లక్షల ఇళ్లను నిర్మించామని లెక్కలు చూపారని ఆయన గుర్తు చేశారు. కానీ, లబ్దిదారులకు ఇళ్లు నిర్మించలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లను నిర్మించనుందన్నారు. వచ్చే ఏడాది జనవరి , ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో సుమారు 19 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు.

వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. దేశంలో వ్యవసాయంలో 11 శాతం అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీ రాష్ట్రమని  చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. పాడిపరిశ్రమ, ఉద్యానవనశాఖ, చేపల పెంపకంపై కేంద్రీకరించిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.అక్వా రంగానికి యూనిట్ ధరను రూ.1.50లకు తగ్గించినట్టు చెప్పారు.

ఏపీ రాష్ట్రంలో రైతుల రుణ మాఫీ చేసినట్టు చెప్పారు. రైతాంగం కోసం రూ.24 వేల కోట్లను ఇచ్చినట్టు చెప్పారు. రుణమాఫీ, పెన్షన్ ఇచ్చినందుకు కేంద్రం నుండి నిదులు ఇవ్వడం లేదన్నారు.రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ లో ఉందన్నారు.అయితే కేంద్రం నుండి లోటు బడ్జెట్ ఉన్నందున నిదులు ఇస్తామని ఇచ్చిన హమీలను అమలు చేయాలని చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తాను ఆనాడూ బీజేపీతో పొత్తు పెట్టుకొన్నట్టు ఆయన చెప్పారు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకొంటామని మోడీ ఏపీలో జరిగిన పలు  ఎన్నికల సభల్లో  ఇచ్చిన హమీలను ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఆయన చెప్పారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి రూ.57వేల కోట్లు ఖర్చు అవుతోందన్నారు. గత ప్రభుత్వం , ఇప్పుడు కేంద్రంలో  అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడ సహకరిస్తామని చెప్పారు. కానీ, నిధులను ఇవ్వడంలో కూడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు ఆరోపించారు.

వైసీపీ, జనసేనలు కేంద్రంపై పోరాటానికి మద్దతు ఇవ్వకుండా  తనపై విమర్శలు చేయడం సరైందా అని బాబు విమర్శించారు.కేంద్రం ఏ మాత్రం కూడ ఏపీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. ఏపీకి న్యాయం చేయడం కోసమే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు ఆయన చెప్పారు కేంద్రంపై అవిశ్వాసం కూడ పెట్టినట్టు ఆయన గుర్తు చేశారు.

ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకోవడం ఎవరి వల్ల కాదన్నారు. రెండు సెషన్లో వినలేదన్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి అన్ని పార్టీలను ఒప్పించినట్టు చెప్పారు. 126 మంది ఎంపీలు ఏపీ ప్రయోజనాల కోసం  మద్దతుగా నిలిచినట్టు ఆయన చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగింది.... న్యాయం చేయాలని మన్మోహన్ సింగ్, అప్పటి కేంద్రమంత్రులు కూడ ఇటీవల రాజ్యసభలో మాట్లాడారని ఆయన చెప్పారు. కానీ, రాజ్యసభలో బీజేపీ మాత్రం  ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. రాజ్యసభలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు అడ్డగోలుగా వాదించారని చంద్రబాబునాయుడు చెప్పారు.  

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రంపై తాను చేసే పోరాటానికి మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. భావితరాల భవిష్యత్తు కోసం తాను పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

గతంలో కూడ ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయనను పదవి నుండి తప్పించారని చెప్పారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేవరకు పోరాటం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అది టీడీపీ చరిత్ర అన్నారు.

ప్రతి రోజూ శుక్రవారం నాడు కోర్టుకు హాజరయ్యే నేతలు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన  చెప్పారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకొనేందుకు జగన్ ఎన్డీఏ ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నాడని చంద్రబాబునాయుడు విమర్శించారు. మరోవైపు  ప్రత్యేక హోదా అంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని చంద్రబాబునాయుడు చెప్పారు.  నాలుగేళ్లుగా కేంద్రం సహకరించి ఉంటే ఏపీ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా కూడ బెల్ట్‌షాపులు పెడితే బెల్టు తీస్తామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ప్రభుత్వమంటే ఏమిటో చూపిస్తామని చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. 

లోక్‌సభలో మోడీ తనపై విమర్శలపై ప్రస్తావించారు. తాను వైసీపీ ట్రాప్‌లో పడ్డానని మోడీ చెప్పారన్నారు. నేను వైసీపీ ట్రాప్‌లో పడలేదన్నారు. మోడీ మాత్రమే అవినీతి ట్రాప్‌లో పడ్డారని  చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. 

కేసీఆర్ ను పొగిడితే నన్ను కించపరిచారన్నారు. కేసీఆర్ కు గౌరవిస్తానని చెప్పారు. కేసీఆర్ కూడ చాలా కాలం పాటు టీడీపీలో ఉన్నారని ఆయన చెప్పారు. మేమిద్దరం కలిసి పార్టీలో పనిచేసినట్టు ఆయన చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ సీఎంగా ఎన్నికయ్యారని ఆయన చెప్పారు. ఆయనను గౌరవిస్తామన్నారు. కానీ, కేసీఆర్ పరిణితి చెందినట్టు వ్యవహరిస్తే తాను అలా వ్యవహరించలేదని మోడీ చేసిన కామెంట్లను ఆయన తప్పుబట్టారు. తనకు ప్రజల కితాబు కావాలన్నారు.


25 ఎంపీలను గెలిపిస్తే దేశంలో చక్రం తిప్పేది టీడీపీయేనని ఆయన చెప్పారు. తనకు పదవి మీద వ్యామోహం లేదన్నారు. కానీ, మోడీకి పదవి మీద వ్యామోహం ఉందన్నారు. తమ అవసరం కోసం మద్దతు కావాలన్నారు. కానీ, మనకు సహకరించలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి పార్టీతో లాలూచీ పడితే కొన్ని ఓట్లు, సీట్లు వస్తాయని బీజేపీ భావిస్తోందన్నారు.

రాష్ట్రం కోసం వైసీపీ, బీజేపీ తప్ప అన్ని పార్టీలు మనకు అండగా నిలిచాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రధానమంత్రి ఎన్నికైతే మనకు ప్రయోజనం కలుగుతోందో నిర్ణయిస్తామన్నారు. వైసీపీని నమ్మితే కుక్క తోకను గోదారి పట్టుకొని ఈదినట్టేనని జగన్ పై బాబు విమర్శలు గుప్పించారు. రాజీనామాలు చేస్తామని చెప్పి ఇప్పుడు రాజీనామాలు చేశారన్నారు. కేంద్రంపై అవిశ్వాసం జరిగే సమయంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చొన్నారని బాబు విమర్శలు చేశారు.

ఎవరికీ భయపడి రాజీనామాలు చేయాలని బాబు ప్రశ్నించారు. ప్రతిరోజూ ఢిల్లీలో ఉంటాం, గజగజలాడిస్తామన్నారు. తెలుగు జాతి సత్తాను చూపుతామని ఆయన చెప్పారు. వెనుతిరిగి చూడమన్నారు. సీఎంగా నేనే చేసే పోరాటానికి సహకరించాలన్నారు. దేశ స్వాతంత్ర్యం సమయంలో కూడ కొందరు భారతీయులు బ్రిటీష్ వారికి సహకరించినట్టు చెప్పారు. తెలుగు జాతి కలిసకట్టుగా ఉంటామన్నారు.  

ఈ వార్త చదవండి: చంద్రబాబు ముందు జగన్ దిగదుడుపే: ఉండవల్లి

Follow Us:
Download App:
  • android
  • ios