Asianet News TeluguAsianet News Telugu

సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి: చికిత్సపై డాక్టర్ సుధాకర్ లేఖ కలకలం

తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ  చికిత్సతో తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు.
 

doctor sudhakar writes letter to visakhapatnam mental hospital superintendent
Author
Visakhapatnam, First Published May 27, 2020, 3:37 PM IST

విశాఖపట్టణం: తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ  చికిత్సతో తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు.

డాక్టర్ సుధాకర్ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రి సూపరింటెండ్ కు బుధవారం నాడు లేఖ రాశారు.మెరుగైన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సూపరింటెండ్ ను ఆ లేఖలో కోరారు.ఎలాంటి పరీక్షలు చేయకుండానే తాను మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని సుధాకర్ ఆరోపించారు. 

also read:డాక్టర్ సుధాకర్‌కు చేసిన‌ ట్రీట్ మెంట్‌ను బయటపెట్టాలి: వర్ల రామయ్య

ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ ను విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో డాక్టర్ సుధాకర్ రోడ్డుపై రభస సృష్టించడంతో అతడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ సమయంలో డాక్టర్  సుధాకర్ పై దాడి చేసిన కానిస్టేబుల్‌ను సీపీ సస్పెండ్ చేశారు.

డాక్టర్ సుధాకర్ ను ప్రస్తుతం విశాఖపట్టణం మెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ కు అందిస్తున్న చికిత్సను బయటపెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇటీవలనే డిమాండ్ చేశారు. 

డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేసిన ఘటనపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత రాసిన లేఖను పిటిషన్ గా స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపింది. డాక్టర్ సుధాకర్ పై దాడి ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఈ నెల 22వ తేదీన ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios